Jitendra Singh: అమిత్ షా కాల్పులకు ఆదేశాలు ఇవ్వరు, మెజిస్ట్రేట్ ఇస్తారు: కేంద్రం క్లారిటీ..
- కాల్పులకు ఆదేశించింది అమిత్ షానే..
- లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు..
- కాల్పులకు మంత్రి ఆదేశాలు ఇవ్వలేరని, మెజిస్ట్రేట్ ఇస్తారని కేంద్రం క్లారిటీ..
- అసలు విద్యార్థులపై ఎలాంటి కాల్పులు జరగలేదని స్పష్టం చేసిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jitendra Singh: లోక్‌సభలో యాంటీ-పేపర్ లీక్ బిల్లు, విద్యార్థి నిరసనలపై ప్రతిపక్షాలు ఎన్డీయే సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశాయి. కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘర్షణల్లో అమిత్ షానే కాల్పులు జరిపేందుకు భద్రతా బలగాలకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. అయితే, కేంద్రం ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది. దీనికి సంబంధించిన ఆధారాలు ఉంటే సభ ముందు ఉంచాలని సవాల్ విసిరింది.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఖండించారు. పరిపాలన ఎలా పనిచేస్తుందో ప్రతిపక్ష నేతకు అవగాహన లేదని విమర్శించారు. ఏ పరిస్థితుల్లోనైనా కాల్పులకు ఆదేశాలు ఇవ్వగలిగే అధికారం మంత్రి వద్ద ఉండదని, కేవలం మెజిస్ట్రేట్ లేదా సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్లకు మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలరని ఆయన అన్నారు. విద్యార్థులపై ఎలాంటి కాల్పులు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ మాత్రమే ఉపయోగించారని, కాల్పులు జరగలేదని పేర్కొన్నారు.
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. విద్యార్థులపై జరిగిన దాడికి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి ఆదేశాలు ఇచ్చి ఉండాలి, లేదా అలాంటి చర్యల గురించి ఆయనకు తెలియకపోయి ఉండొచ్చని అన్నారు. మొదటి పరిస్థితుల్లో ఆయన బాధ్యత వహించాలని, ఆయనకు తెలియకపోతే మంత్రిగా ఆయన అసమర్థుడు అని అన్నారు. ఆయన సభకు వచ్చి సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి