Mamata Banerjee: బెంగాల్‌ను టార్గెట్ చేసినవారు నరకానికి వెళ్తారు
- రంజాన్ వేడుకల్లో మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు
- ‘బీజేపీ హఠావో.. దేశ్ బచావో’ నినాదం
- బెంగాల్‌ను టార్గెట్ చేసినవారిపై తీవ్ర హెచ్చరిక
- ఐక్యతకు పిలుపునిచ్చిన సీఎం మమతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీని గద్దె దించి, దేశాన్ని రక్షించడమే తమ ఏకైక లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. కోల్‌కతాలో శనివారం నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ రాష్ట్రాన్ని , ఇక్కడి ప్రజలను టార్గెట్ చేస్తున్న వారు ఖచ్చితంగా నరకానికి వెళ్తారని మమతా బెనర్జీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న వారికి తగిన శాస్తి జరుగుతుందని ఆమె హెచ్చరించారు. “బిజెపి హఠావో.. దేశ్ బచావో” (బీజేపీని తరిమికొట్టండి.. దేశాన్ని రక్షించండి) అనే నినాదంతో ముందుకు వెళ్లాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Also Read
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Passport Row: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- Passport Citizenship Controversy: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
రాబోయే రోజుల్లో బీజేపీని అధికారంలో నుంచి దించడమే తమ ప్రధాన టార్గెట్ అని ‘దీదీ’ ప్రకటించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని, ఐక్యతను కాపాడుకోవడానికి అందరూ కలిసి రావాలని కోరారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ, అందరూ కలిసికట్టుగా ఉండి దేశ సంరక్షణలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) కీలక నేతలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మమతా బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
SS Rajamouli: “ఆ సీన్ అదిరింది రణవీర్”.. ధురందర్ 2పై జక్కన్న రియాక్షన్.. ఆదిత్య ధర్ రిప్లై!
తాజావార్తలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. ‘బేబీ బాస్’ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
-
Passport Row: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!