Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ సాధించిన భారీ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే, తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్లో రిలేషన్ పై సమంత చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీశాయి. సమంత ఇండైరెక్ట్‌గా అక్కినేని నాగచైతన్య భార్య, నటి శోభిత ధూళిపాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చిందంటూ నెటిజన్లు క్లిప్స్‌ను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.
అసలు ఏమైందంటే?
సక్సెస్ మీట్ వేదికగా సమంత మాట్లాడుతూ.. ఒకరిపై పూర్తిగా ఆధారపడకుండా, మానసికంగా ఎవరికి వారు ఒంటరిగానైనా బలంగా ఉండటం ఎంత ముఖ్యమో వివరించారు. “మన కెరీర్, మన రిలేషన్షిప్ అనేవి మన చేతుల్లోనే ఉంటాయి. కానీ కొన్నిసార్లు బంధాలు చాలా సంక్లిష్టంగా మారుతుంటాయి. అవి ఎప్పుడూ మన కంట్రోల్లో ఉండవు. ఒక బంధం నిలబడాలి అంటే ఇద్దరు వ్యక్తులు కలిసికట్టుగా ప్రయత్నించాలి. కాబట్టి ఒక మహిళగా నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే.. ముందు మనపై మనకు నమ్మకం ఉండాలి. ఎవరికి వారు ఒక వ్యక్తిగా పరిపూర్ణంగా మారాలి” అని సమంత స్పష్టం చేశారు. జీవితంలో సరైన భాగస్వామి దొరకడం ముఖ్యమే అయినప్పటికీ, అవతలి వ్యక్తి వచ్చి మన జీవితాన్ని పూర్తి చేస్తాడని ఎవరూ ఆశించకూడదని సమంత హితవు పలికారు.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
“ఏదో ఒక సమయంలో మీకు తగ్గ సరైన వ్యక్తి దొరుకుతారు. కానీ, నిన్ను పూర్తి చేయడానికి ఇంకొకరు కావాలని చూస్తే లేదా ఆ వ్యక్తి కోసం ఎదురుచూస్తే.. అది సరిగ్గా వర్కవుట్ అవ్వదు. ఎందుకంటే అలా అనుకున్నప్పుడు అవతలి వ్యక్తిపై అంచనాలు విపరీతంగా పెరిగిపోతాయి. అది అస్సలు కరెక్ట్ కాదు” అంటూ సమంత ఎమోషనల్ అయ్యారు.
శోభిత వెడ్డింగ్ వీడియో కామెంట్స్‌తో లింక్ పెడుతున్న నెటిజన్లు!
సమంత మాట్లాడిన ఈ వీడియో క్లిప్స్ నెట్టింట వైరల్ కావడంతో, నెటిజన్లు దీనికి గల బ్యాక్‌స్టోరీని వెలికితీశారు. గతంలో నాగచైతన్య, శోభితల వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ వీడియోలో శోభిత బంధాల గురించి ఒక మాట చెప్పారు. “మనుషులు ఎవరికి వారు పరిపూర్ణులే అయినప్పటికీ.. ఒక భాగస్వామి మన జీవితంలో ఉన్న ఖాళీని భర్తీ చేసి, లైఫ్‌ను మరింత నిండుగా, బ్యాలెన్స్డ్గా మారుస్తారు” అని శోభిత పేర్కొన్నారు. శోభిత చెప్పిన ‘లైఫ్ పూర్తి అవుతుంది’ అనే పాయింట్‌ను టార్గెట్ చేస్తూనే.. సమంత “నిన్ను పూర్తి చేయడానికి ఇంకొకరు అవసరం లేదు” అంటూ కౌంటర్ ఇచ్చిందని నెటిజన్లు గట్టిగా నమ్ముతున్నారు.
కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే: సమంత తన ప్రసంగంలో ఎక్కడా నాగచైతన్య పేరు కానీ, శోభిత పేరు కానీ ప్రస్తావించలేదు. ఇది కేవలం ఆమె వ్యక్తిగత అనుభవంతో చెప్పిన మాటలే అనిపిస్తున్నా నెటిజన్లు మాత్రం శోభితతో లింక్ చేసి కామెంట్లు చేస్తున్నారు. గతంలో నాగచైతన్య, సమంతలు నాలుగేళ్ల వైవాహిక బంధం తర్వాత అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చైతన్య, శోభితను వివాహం చేసుకున్నారు. సమంత రాజ్ నిడిమోరుని వివాహం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!