Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోడీకి ఆహ్వానం..
- ఇరాన్ ఆహ్వానంతో ఇరకాటంలో మోడీ సర్కార్..
- ఇరాన్-అమెరికా-ఇజ్రాయిల్ సంబంధాల నేపథ్యంలో ప్రాధాన్యత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khamenei funeral: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోడీని ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ ఆహ్వానించారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఆయన మరణించారు. జూలై 4 నుంచి 9 మధ్య ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇరాన్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచ దేశాధినేతలతో పాటు మోడీకి ఆహ్వానం అందింది. అయితే, ఇప్పుడు ఈ ఆహ్వానం భారత్‌ను దౌత్య సంకటంలో పడేసింది. ఇరాన్‌తో భారత్‌కు ఉన్న చారిత్రక సంబంధాలు, యూఎస్-ఇజ్రాయిల్‌తో ఉన్న వ్యూహాత్మక సంబంధాల మధ్య భారత విదేశాంగ విధానానికి కీలక పరీక్షగా మారింది.
అయితే, ఖమేనీ అంత్యక్రియలకు మోడీ స్వయంగా హాజరయ్యే అవకాశం లేదని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆ సమయంలో ప్రధాని విదేశీ పర్యటనలో ఉండే అవకాశం ఉంది. భారత్ తరుఫున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇరాన్‌తో భారత్‌కు చారిత్రాత్మక సంబంధాలతో పాటు చమురు, వాణిజ్యం వంటి దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా, భారత్ పెట్టుబడులు పెట్టిన చాబహార్ పోర్టు చాలా కీలకంగా ఉంది. మరోవైపు అమెరికాతో భారత్‌కు బలమైన వాణిజ్య సంబంధాలు, రక్షణ సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయిల్‌తో వ్యూహాత్మక రక్షణ, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో సహకారం ఉంది.
Also Read
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
ఒక వేళ ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తన ప్రతినిధి బృందాన్ని పంపితే, ఇరాన్‌తో సంబంధాలకు భారత్ ప్రాధాన్యత ఇచ్చే విషయాన్ని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో దీనిని అమెరికా, ఇజ్రాయిల్ ఎలా చూస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 2024లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు భారత్ ఒక రోజు సంతాప దినాన్ని ప్రకటించింది. అప్పటి ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌ను అంత్యక్రియలకు పంపింది. ఈసారి కూడా ఇదే తరహా విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది.
షియా ముస్లింలకు ఇరాన్ పెద్ద దిక్కుగా ఉంది. ఇరాన్ తర్వాత భారత్, పాకిస్తాన్లో షియా జనాభా ఎక్కువగా ఉంది. ఖమేనీ షియా ముస్లింలలో పెద్ద నాయకుడిగా పరిగణింబడుతారు. ఈ నేపథ్యంలో ఖమేనీ అంత్యక్రియలకు భారత్ ఎలా స్పందిస్తుందనే దానికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతానికి భారత్ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇరాన్-అమెరికా-ఇజ్రాయిల్ సంబంధాలను భారత్ ఎలా బ్యాలెన్స్ చేస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?