Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- కేతన్ అగర్వాల్ హత్య కేసులో వెలుగులోకి కొత్త విషయాలు
- ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- విచారణలో ఒకరిపై ఒకరు నిందలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాబోయే భర్త కేతన్‌తో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ సియా గోయల్ అంతమొందించిన తీరు దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ప్రేమ ఒలకబోస్తున్నట్లుగా కపట నాటకం ఆడి అమాయకుడైన కేతన్‌ను ఘటికురాలు భూమ్మీద లేకుండా చేసింది. తాజాగా పోలీసుల అదుపులో ఉన్న ప్రియుడు చేతన్ చౌదరి సంచలన విషయాలు పోలీసులకు వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
- Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
- Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరి పోలీసుల విచారణలో ఉన్నారు. ఈ సందర్భంగా చేతన్ కొత్త విషయాలు వెల్లడించాడు. తాను సియాతో కలిసి పారిపోవాలనుకున్నానని.. కానీ కేతన్‌ను చంపాలని పట్టుబట్టింది సియానేనని.. ఆమె ప్రణాళిక ప్రకారమే చేసినట్లుగా చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తోంది. సియా మాత్రం ప్రియుడి వ్యాఖ్యలతో విభేదిస్తూ లేదు.. లేదు.. చేతన్ చెప్పినట్లుగానే చేసినట్లుగా పేర్కొంది. ఇలా ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే జూన్ 14న కేతన్‌ను హత్య చేయడానికి చేసిన తొలి ప్రయత్నం విఫలమైన తర్వాత చేతన్ తన ముందు ఏడ్చాడని.. దీంతో జూన్ 18న ఎలాగైనా చంపాలని నిర్ణయానికి వచ్చినట్లుగా ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. “ఇద్దరూ హత్య కుట్ర బాధ్యతను ఒకరిపై ఒకరు మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది వారి రక్షణ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే కేతన్‌ను హత్య చేయడానికి ఇద్దరూ కలిసి కుట్ర పన్నినట్లు సూచించే బలమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి” అని తెలిపారు.

మే 31 నుంచి జూన్ 4 మధ్యకాలంలో సియా, చేతన్ పూణెలోని ఒక కేఫేలో కలుసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమావేశం హత్య కుట్రలో భాగమేనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ రికార్డులు, ఫోన్ సంభాషణలు, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

కేతన్ అమెరికాలోని బోస్టన్‌లో మాస్టర్స్ పూర్తి చేసి ఇటీవలే భారత్‌కు వచ్చాడు. కేతన్ కుటుంబానికి, సియా కుటుంబానికి 1990ల నుంచి పరిచయం ఉంది. ఈ ఏడాది గుల్బర్గాలో జరిగిన ఓ వివాహ వేడుకలో కేతన్, సియా కలుసుకున్నారు. అనంతరం పెళ్లి చర్చలు వేగంగా జరిగి.. వారంలోపే నిశ్చితార్థం జరిగింది. అయితే సియా అప్పటికే చేతన్‌తో ప్రేమ సంబంధంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేతన్‌ను పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి ఆమెకు లేదని దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అయినప్పటికీ ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో ఘనంగా వివాహం నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

జూన్ 18న కేతన్ లోయలో పడిపోయిన వెంటనే సియా కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చి అది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని చెప్పింది. అయితే ఆమె వాంగ్మూలంలో ఉన్న వైరుధ్యాలు, సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన అనుమానాస్పద వ్యక్తి కారణంగా కేసు మలుపు తిరిగింది. ఆ వ్యక్తి తర్వాత చేతన్‌గా గుర్తించబడటంతో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు అనంతరం జూన్ 23న సియా గోయల్, చేతన్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య కుట్రలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. తవ్వేకొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ హత్యపై నెట్టిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇష్టం లేకపోతే.. ఇష్టం లేదని చెప్పొచ్చు కదా? చంపాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ సియా గోయల్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.

తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?