SS Rajamouli: “ఆ సీన్ అదిరింది రణవీర్”.. ధురందర్ 2పై జక్కన్న రియాక్షన్.. ఆదిత్య ధర్ రిప్లై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli: ప్రస్తుతం భారత చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘బాహుబలి’ వంటి గొప్ప చిత్రాలను తెరకెక్కించి ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా ఎంతో చూపించాడు. ఈ రోజు ప్రపంచం నలుమూలల ఉన్న ప్రతి ఒక్కరూ రాజమౌళి అంటే గుర్తుపట్టే విధంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే.. తాజాగా రాజమౌళి “ధురంధర్ ది రివెంజ్” సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆదిత్య ధర్ సీక్వెల్ అయిన ధురందర్ 2ను ప్రశంసిస్తూ.. ఆర్. మాధవన్, రణవీర్ సింగ్‌ల నటనను అభినందించారు. ముఖ్యంగా 4 గంటల సుదీర్ఘ నిడివి ఉన్నప్పటికీ, ప్రేక్షకులను సీటు నుంచి కదలకుండా చేయడంలో దర్శకుడు ఆదిత్య ధార్ విజయం సాధించారని, ఇది ఒక గొప్ప సాహసమని రాజమౌళి కొనియాడారు.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
“నాకు ధురందర్-1 చాలా నచ్చింది. కానీ ‘ది రివెంజ్’ స్కేల్, ఎమోషన్ పరంగా అంతకు మించి పోయింది. రచన, నటీనటుల ఎంపిక, సాంకేతిక నైపుణ్యం, సంగీతం, దర్శకత్వం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కానీ, ఇందులోని భావోద్వేగభరితమైన అంశాలే ఈ సినిమాకు అసలైన బలాన్ని ఇచ్చాయి. డైరెక్టర్ ఆదిత్య ధర్ అదరగొట్టారు. 4 గంటల నిడివి ఉన్న సినిమాను తీసి విడుదల చేయడానికి చాలా ధైర్యం కావాలి. ముఖ్యంగా 4 గంటల సుదీర్ఘ నిడివి ఉన్నప్పటికీ, ప్రేక్షకులు చివరి వరకు సీట్లకు అతుక్కుపోతారు. రణవీర్ అద్భుతంగా నటించావు. షెడ్డులో సోదరితో ఉన్న సన్నివేశం అదిరిపోయింది. ఆ ప్రారంభం నుంచి గుండెను పిండేసే క్లైమాక్స్ వరకు, హమ్జా, జస్కిరత్‌గా మీరిద్దరూ మమ్మల్ని మంత్రముగ్ధులను చేశారు. నటుడుమాధవన్ గండి, మీరు ఒక దేశం నిస్సహాయతను, నిరాశను ఎంత అద్భుతంగా ప్రదర్శించారంటే.. మీ విజయాన్ని మా విజయంగా భావించాం.. ఈ ఘన విజయం సాధించిన చిత్ర బృందానికి అభినందనలు.”అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
READ MORE: Trump: ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ వ్యూహం ఇదేనా? ఇరాన్ ఏం చేయబోతుంది?
ఇక రాజమౌళి రియాక్షన్‌పై ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ స్పందించారు. రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు. మీ వంటి గొప్ప దర్శకుడి నుంచి ఇలాంటి ప్రశంసలు రావడం ఆశీర్వాదంగా, అదే సమయంలో బాధ్యతగా భావిస్తున్నానని ఆదిత్య ధర్ పేర్కొన్నారు. దర్శకులుగా మీ వంటి వారు సృష్టించిన అద్భుతమైన సినిమా ప్రపంచాలను చూస్తూనే తాము పెరిగామని, ఇప్పుడు తమ సినిమా మిమ్మల్ని అంతగా మెప్పించడం వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్ని ఇస్తోందని రాశారు. కేవలం నిజాయితీతో కూడిన కథను చెప్పడమే కాకుండా, భారతీయ సినిమా స్థాయిని (Scale), ఆత్మను (Soul) ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేశామని వివరించారు.
I loved Dhurandhar-1, but The Revenge surpassed the original in both scale and soul.
The writing, casting, technical execution, music, world design and direction are flawless…. But it’s the emotional stakes that really ground it.The writing manages to weave plot twists that…
— rajamouli ss (@ssrajamouli) March 21, 2026
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..