THese 10 Animals That Can Spread Rabies: సాధారణంగా మనకు కుక్క కరిస్తేనే ‘రేబిస్’ వ్యాధి వస్తుంది అనుకుంటాం. కానీ అది నిజం కాదు. కుక్కలతో పాటు మరికొన్ని జంతువులు కరిచినా రేబిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. రేబిస్ అనేది ఒక ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇది సాధారణంగా జంతువుల కాటు ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి మెదడు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే.. ప్రాణాంతకం కావచ్చు.…
‘రేబిస్’ బారిన పడి మరో యువకుడు మరణించాడు. ఇటీవల ఓ కబడ్డీ ప్లేయర్ కుక్క పిల్లను కాపాడుతుండగా.. అది చిన్నగా కొరికింది. చిన్న కుక్క పిల్లే కదా ఏమవుతుందిలే అని దానిని నిర్లక్ష్యం చేశాడు. దాదాపుగా మూడు నెలలు రేబిస్ వ్యాధితో బాధపడుతూ అతడు చనిపోయాడు. ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో నివసించే రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారుడు బ్రిజేష్ (22) రేబిస్ వ్యాధితో ఇటీవల మరణించాడు. రెండు నెలల క్రితం డ్రెయిన్ నుంచి కుక్క పిల్లను రక్షిస్తున్నప్పుడు…
ఎనిమిది వారాల్లోగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని అన్ని వీధి కుక్కలను ఆశ్రయాలకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని నటి సదా తీవ్రంగా వ్యతిరేకించారు. రేబిస్ వల్ల ఒక బాలిక మరణించిన సంఘటన ఆధారంగా ఈ తీర్పు వెలువడింది. సదా ఈ నిర్ణయాన్ని “కుక్కల ఊచకోత”గా అభివర్ణించారు. “ప్రభుత్వం, స్థానిక సంస్థలు లక్షల కుక్కలకు ఆశ్రయాలు, టీకాలు వేయలేకపోవడం వారి అసమర్థత” అని ఆమె ఆరోపించారు. ABC (జంతు జనన నియంత్రణ) కార్యక్రమం సరిగ్గా అమలై ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని…
Rabies: కుక్కకాటు తర్వాత రేబిస్ వ్యాధి సోకకుండా యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. అయితే, మహారాష్ట్రకు చెందిన ఓ యువతి కుక్క కరిచిన తర్వాత రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మూడు రోజుల తర్వాత రేబిస్‌తో మరణించింది. అత్యంత అరుదుగా జరిగిన ఈ ఘటన కొల్హాపూర్‌లో చోటు చేసుకుంది. మొత్తం 5 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఆమె ప్రాణాలు దక్కలేదు.
కుక్కలు అంటూనే బాబోయ్ అంటున్నారు ప్రజలు. కుక్కలను చూడగానే ఆమడదూరంలో పరుగెడుతున్నారు. వీధిల్లో తిరగాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఇక.. దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒక కుక్క కాటు నమోదవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.