Maharashtra Political Crisis: ముంబైలో హై అలర్ట్.. సెక్షన్ 144 విధింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయం సినిమాను తలపిస్తోంది. రోజుకో ట్విస్ట్ జరుగుతోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ‘ మహావికాస్ అఘాడీ’ కూటమి ప్రస్తుతం మైనారిటీలో పడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే తో 37 మంది శివసేన ఎమ్మెల్యేలు అస్సాం గౌహతిలో క్యాంపు ఏర్పాటు చేశారు. వీరితో పాటు మరో 7-8 మంది స్వతంత్ర ఎమ్యెల్యేలు ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో శివసేన ఇప్పుడు అధికారంతో పాటు పార్టీని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. 2/3 ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏక్ నాథ్ షిండే క్యాంపులో ఉన్నారు.
ఇదిలా ఉంటే మహారాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిన్నటి నుంచి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం శివసేన జిల్లా అధ్యక్షులతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సమావేశం అయిన తర్వాత నుంచి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పెద్ద సంఖ్యలో శివసైనికులు రోడ్లపైకి వచ్చి నిరసన, ఆందోళలకు పాల్పడే అవకాశం ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు పోలీసులు. ముఖ్యంగా ముంబై మహానగరంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
తాజాగా శనివారం మహారాష్ట్రలోని చాలా చోట్ల శివసేన కార్యకర్తలు రెబెల్ ఎమ్మెల్యే కార్యాలయాలు, ఇళ్ల ముందు ఆందోళన చేశారు. ప్లెక్సీలు చింపివేయడంతో పాటు పలువురు రెబెల్ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దహనం చేశారు. థానేలోని తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే నివాసం వెలుపల భద్రతను పెంచారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో ముంబై నగరంలో పోలీసులు సెక్షన్ 144 సీఆర్పీసీ విధించారు. వచ్చే నెల 10 వరకు ఈ సెక్షన్ అమలులో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ వెల్లడించారు. మరోవైపు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ లో క్యాంపు ఏర్పాటు చేసిన ఏక్ నాథ్ షిండే వర్గానికి ఆ రాష్ట్ర ఎన్సీపీ, శివసేన కార్యకర్తల నిరసనలు ఎదురవుతున్నాయి. హోటల్ వెలుపల వారంతా ఆందోళన చేస్తున్నారు. దీంతో అస్సాం ప్రభుత్వం అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!