మహారాష్ట్రలో రాజకీయం సినిమాను తలపిస్తోంది. రోజుకో ట్విస్ట్ జరుగుతోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ‘ మహావికాస్ అఘాడీ’ కూటమి ప్రస్తుతం మైనారిటీలో పడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే తో 37 మంది శివసేన ఎమ్మెల్యేలు అస్సాం గౌహతిలో క్యాంపు ఏర్పాటు చేశారు. వీరితో పాటు మరో 7-8 మంది స్వతంత్ర ఎమ్యెల్యేలు ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో శివసేన ఇప్పుడు అధికారంతో పాటు పార్టీని కూడా…