School Girls: మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలోని నైన్‌పూర్‌లో స్కూల్ యూనిఫాం ధరించిన ఇద్దరు విద్యార్థినులు నేరుగా మద్యం దుకాణానికి వచ్చి, మద్యం కొనగోలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైన్ షాప్ ముందు ఉన్న సీసీ టీవీలో ఇద్దరు విద్యార్థినులు స్కూల్ యూనిఫాంలో వచ్చి మందు కొంటున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఇదిలా ఉంటే, షాప్ యజమాని వీటన్నింటిని పట్టించుకోకుండా వారికి లిక్కర్ అమ్మడం కూడా అందులో రికార్డ్ అయింది.
ప్రస్తుతం, ఈ సంఘటన వైరల్ కావడంతో అధికారులు రంగంలోకి దిగారు. స్కూల్ అమ్మాయిలు తలకు స్కార్ఫ్ చుట్టుకుని షాపులోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. కౌంటర్ వద్ద మద్యం కొనుగోలు చేసి వెళ్లిపోతున్నట్లు వీడియోలో రికార్డ్ అయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) అశుతోష్ ఠాకూర్, తాహసీల్దార్, స్థానిక పోలీసులు షాప్ వద్దకు వెళ్లి తక్షణ దర్యాప్తు చేశారు.
Read Also: Air India : ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి., క్షణాల్లో తప్పిన పెను ప్రమాదం
మైనర్ అమ్మాయిలు మద్యం అమ్ముతూ, షాపు ఓనర్ నిబంధనలు ఉల్లంఘించినట్లు స్పష్టంగా తేలింది. సీసీటీవీని పరిశీలించిన తర్వాత జనరల్ లైసెన్స్ షరతులు ఉల్లంఘించినట్లు తేలింది. ఎక్సైజ్ విభాగం దర్యాప్తు పూర్తి చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్డీఎం ఆదేశించారు. షాపు యజమానిని విచారిస్తున్నారు. అయితే, అమ్మాయిలు తమ ఇష్టపూర్వకంగా వచ్చారా.? లేక ఎవరైనా మందు తీసుకురావాలని చెప్పడంతో వచ్చారా..? అని దర్యాప్తు చేస్తున్నారు.
దర్యాప్తు ప్రకారం, ఈ సంఘటన నిజమే అని తేలింది. మైనర్లకు మందు విక్రయించినందుకు షాప్ లైసెన్స్ క్యాన్సల్ చేస్తామని ఎక్సైజ్ అధికారి రాంజీ పాండే చెప్పారు. ఈ ఘటన రాజకీయ వివాదంగా మారింది. స్థానిక కాంగ్రెస్ నేతలు, అధికార బీజేపీని విమర్శించారు.