School Girls: మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలోని నైన్‌పూర్‌లో స్కూల్ యూనిఫాం ధరించిన ఇద్దరు విద్యార్థినులు నేరుగా మద్యం దుకాణానికి వచ్చి, మద్యం కొనగోలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైన్ షాప్ ముందు ఉన్న సీసీ టీవీలో ఇద్దరు విద్యార్థినులు స్కూల్ యూనిఫాంలో వచ్చి మందు కొంటున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి.