Laya : సీనియర్ హీరోయిన్ లయ గురించి పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఫీల్ గుడ్ సినిమాలతో అలరించింది. దాదాపు 40 తెలుగు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. నితిన్ నటించిన తమ్ముడు మూవీతో వస్తున్న లయ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘బాలకృష్ణ గారితో నేను విజయేంద్ర వర్మ సినిమాలో నటించాను. ఆయన సెట్స్ లో ఎలా ఉంటారో నాకు అంతకు ముందు పెద్దగా తెలియదు. మొదటి రోజే మా ఇద్దరికీ ఓ సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ షూటింగ్ లో పొరపాటున నేను ఆయన కాలు తొక్కేశాను. దాంతో ఆయన సీరియస్ గా ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు.
Read Also : Boycott Turkey : టర్కీకి మరో షాక్.. వీటి దిగుమతి కూడా నిలిపివేత
‘నా కాలే తొక్కుతావా.. ఈమెను సినిమాలో నుంచి తీసేయండి’ అని పక్కకు వెళ్లి కూర్చున్నాడు. ఆయన మాటలతో నేను చాలా హర్ట్ అయ్యాను. వెంటనే బోరున ఏడ్చేశాను. నేను ఏడవడం చూసిన బాలకృష్ణ వెంటనే నా దగ్గరకు వచ్చాడు. అయ్యో ఏడుస్తున్నావా నేనేదో సరదాగా అన్నాను. ఇలా కాలు తొక్కించుకోవడం నాకు కొత్తేం కాదు… షూటింగ్ లో ఇవన్నీ కామన్’ అంటూ చెప్పాడు. ఆయన సెట్స్ లో అలాగే సరదాగా ఉంటాడు. ఆ తర్వాత ఆయన ఆయనతో నటించడం జాలీగా అనిపించేది. సినిమా మాకు ఎన్నో గొప్ప అనుభూతులు ఇచ్చింది అంష్ట్ర చెప్పుకొచ్చింది లయ. రీ ఎంట్రీతో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Read Also : Aadi Srinivas : అభివృద్ధిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయి.. అందుకే..