రాజస్థాన్‌లోని కోటాలో ఓ ప్రేమ జంట నానా రచ్చ చేసింది. పోలీస్ జీపు ఎక్కి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఒకరినొకరు కౌగిలించుకుని.. ముద్దులు పెట్టుకుంటూ నానా హంగామా సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే కాన్వాయ్‌లో ప్రయాణిస్తున్న పోలీసు వాహనం బోల్తా పడడంతో నలుగురు పోలీసులు గాయపడ్డారు. పాలీ జిల్లాలోని రోహత్, పానిహరి కూడలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ రైడర్‌ను రక్షించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో పోలీసు బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. కేబినెట్ మంత్రి ఒట్టారామ్ దేవాసి తల్లి ఇటీవల మరణించగా.. ఆయన్ని పరామర్శించడానికి వసుంధర రాజే పాలి జిల్లాలోని బాలికి…
Police Patrol Bike: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పోలీస్ పోస్ట్ వద్ద పార్క్ చేసిన పోలీసు మొబైల్ వాహనం ‘చిరుత’ ను దొంగలు అపహరించారు. అక్టోబరు 15న పట్టపగలు ఈ ఘటన జరిగినా ఇప్పటి వరకు పోలీసులు ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు. అయితే, ఈ విషయం మీడియాలో వెలుగులోకి రావడంతో ఆ శాఖలో కలకలం రేగింది. ఈ కేసులో గుర్తు తెలియని దొంగలపై పోలీసులు కేసు నమోదు చేశారు. Read Also:…
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రిషికేశ్ అత్యవసర వార్డులోకి ఉత్తరాఖండ్ పోలీసు వాహనం ప్రవేశిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆసుపత్రిలోని మహిళా వైద్యురాలిని వేధించినందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నర్సింగ్ అధికారిని అరెస్టు చేయడానికి పోలీసులు ఇలా చేసినట్లు తెలుస్తోంది. 26 సెకన్ల ఈ వీడియోలో, ఆసుపత్రి భద్రతా సిబ్బంది పోలీసు ఎస్యూవీకి మార్గం సుగమం చేస్తూ.. రోగులతో ఉన్నస్ట్రెచర్లను పక్కకు జరపడం చూడొచ్చు. Wedding: పెళ్లికూతురికి ముద్దుపెట్టిన…
పోలీసు వాహనంలో మందుల చాటున తెలంగాణ మద్యం తరలిస్తుండగా పట్టుకున్నారు సెబ్ అధికారులు. ఇక ఏపీ ఎస్పీ 2వ బెటాలియన్ ఆసుపత్రికి మందుల కోసం సుమో వాహనం, డ్రైవర్ కానిస్టేబుల్ శ్రీనివాసులును హైదరాబాద్ కు పంపారు అధికారులు. మందులు తీసుకొస్తున్న వాహనంలో అలంపూర్ చౌరస్తా వద్ద రెండు కేసుల మద్యం మందుల చాటున ఉంచారు ఏపీ ఎస్పీ కానిస్టేబుళ్లు. పంచలింగాల చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలో అక్రమ మద్యం రవాణా గుట్టు రట్టు చేసారు. రెండు…
తూ:గో జుల్లా పెద్దాపురం పోలీసుల నిర్వాకంతో గంజాయి కేసులో నిందితుడు పరారయ్యాడు. ఓ పాత నేరస్తుడు పెద్దాపురం మండలం తూర్పుపాకల గ్రామంలో గంజాయితో దొరికాడు. ఆ నేరస్తుడిని స్టేషన్ కు తరలిస్తుండగా ఏఎస్ఐ బైక్ పై నుంచి దూకి పారిపోయాడు. అయితే పట్టుకున్న గంజాయిని స్టేషన్ కు తరలించారు పోలీసులు. పాత నేరస్తుడు పరారు కావడంతో ఖంగుతిన్న పోలీసులు.. దొరికింది గంజాయి కాదు చెరకు పిప్పి అంటూ కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై విచారించేందుకు రంగంలోకి…