PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల కోల్‌కతా గ్యాంగ్‌రేప్‌ని ఉద్దేశిస్తూ, నిందితులను కాపాడేందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రయత్నిస్తోంది,
West Bengal BJP: ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార, హత్య ఘటనకు ప్రధాన కారణం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీయేనని బెంగాల్ అసెంబ్లీలో విపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు.
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం కేసుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా స్పందించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రపతి మాట్లాడుతూ..
కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వద్దకు చేరింది. ఆర్మీ కాలేజీకి చెందిన వైద్యుడి పిటిషన్‌తో సహా మూడు లేఖ పిటిషన్లు సీజేఐకి పంపబడ్డాయి. ఈ భయంకరమైన ఘటనపై సీజేఐ స్వయంచాలకంగా స్పందించి, త్వరితగతిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్లలో పేర్కొన్నారు.
ఆగస్టు 17న దేశవ్యాప్తంగా అన్ని చిన్నా, పెద్దా ఆసుపత్రులను మూసివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. 24 గంటల పాటు వైద్యులు సమ్మె చేయనున్నారు. ఈ విషయాన్ని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు ఆర్వీ అశోకన్ తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే సమ్మె మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని, రాష్ట్రాలు మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలని అన్నారు.
గాంధీ ఆస్పత్రిలో కోల్‌కతా హత్యాచార ఘటనకు నిరసన చేపట్టిన వైద్యులకు మంత్రి సీతక్క సంఘీభావం ప్రకటించారు. ఓ రోగిని పరామర్శించేందుకు గాంధీ ఆసుపత్రికి వచ్చిన మంత్రి సీతక్క.. మహిళలపై అఘాయిత్యాలను నిలువరించాలని వ్యాఖ్యానించారు.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవల బంద్‌కు జూడాలు పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా నేడు ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ 14వ తేదీన ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు జూడాలు ప్రకటనలో వెల్లడించారు.