Allahabad High Court: 2021 కోర్టు ధిక్కార కేసులో అలహాబాద్ హైకోర్టు స్థానిక న్యాయవాది అశోక్ పాండేకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. టీ-షర్ట్ తో న్యాయవాది కోర్టుకు హాజరు కావడంతో గురువారం నాడు న్యాయమూర్తులు వివేక్ చౌదరి, బీఆర్ సింగ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. అశోక్ పాండే గత ప్రవర్తన, చట్టపరమైన ప్రక్రియలో పాల్గొనడానికి ఆయన నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక, సదరు లాయ్ కి రూ. 2,000 జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అతనికి అదనంగా మరో నెల రోజులు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు.
Read Also: Trump-Musk: ట్రంప్-మస్క్ మధ్య చెడిన స్నేహం! సలహాదారుడిగా వైదొలిగే ఛాన్స్!
అయితే, లక్నోలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు లొంగిపోవడానికి న్యాయవాది అశోక్ పాండేకు నాలుగు వారాల సమయం ఇచ్చింది అలహాబాద్ హైకోర్టు. అలాగే, లక్నో న్యాయస్థానంలో లాయర్ గా ప్రాక్టీస్ చేయకుండా పాండేను ఎందుకు నిషేధించకూడదో ప్రశ్నిస్తూ షో-కాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. మే 1వ తేదీలోగా ఆయన స్పందించాలని తేల్చి చెప్పింది.
Read Also: KTR: హెచ్‌సీయు భూముల విషయంలో అతి పెద్ద కుట్ర.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కాగా, 2021 ఆగస్టులో అశోక్ పాండే అనుచితమైన దుస్తులు ధరించి కోర్టుకు హాజరయ్యాడు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని న్యాయమూర్తులు చెప్పినప్పుడు ఆయన వారిని “గూండాలు” అంటూ సంబోధించినట్లు ఆరోపణలు రావడంతో కోర్టు ధిక్కార చట్టం కింద కేసు నమోదు చేయబడింది. దీంతో అతడికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ, తనపై వచ్చిన ఆరోపణలకు ఎప్పుడూ స్పందించలేదు.. అలాగే, 2017లో కోర్టు ప్రాంగణం నుంచి రెండేళ్ల పాటు నిషేధం సహా అతని పాత రికార్డులను కోర్టు పరిగణలోకి తీసుకుని.. తాజాగా 6 నెలల పాటు జైలు శిక్ష విధించింది.