AAP: వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడుతాం.. మెగా ర్యాలీ ముందు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా రేపు ప్రతిపక్ష ఇండియా కూటమి ఢిల్లీ వేదికగా భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌తో సహా పలువురు ఇండియా కూటమి నేతలు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడుతామని చెప్పారు. ఇండియా కూటమిలో విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Read Also: Israel: గాజాపై యుద్ధం వేళ ఇజ్రాయెల్‌కు అమెరికా మరో సాయం!
Also Read
- Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్‌లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
‘‘ఇండియా కూటమి ఒకటిగా ఉంది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు జరిగిన సమయంలో కాంగ్రెస్ కీలక నేతలు ఇక్కడ ఉన్నారు. కూటమి నాయకులంతా ఈ అరెస్టును ఖండించారు’’అని అతిషి అన్నారు. కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడంపై చివరి దాడి అని, దీనికి వ్యతిరేకంగా రేపు ప్రతిపక్షాలన్ని తమ గొంతు వినిపించబోతున్నాయని ఆమె చెప్పారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్‌లతో సహా ఇండియా కూటమి నేతలు ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగే ‘మహా ర్యాలీ’కి హాజరవుతున్నారు.
లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు గతవారం కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏప్రిల్ 1 వరకు అతడిని కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పంజాబ్, గోవా ఆప్ నాయకులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఆప్ కీలక నేతలుగా ఉన్న మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ వంటి వారు జైలులో ఉన్నారు.
తాజావార్తలు
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్‌తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్‌లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్‌తో అల్టిమేట్ యాక్షన్ ?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!