AAP: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా రేపు ప్రతిపక్ష ఇండియా కూటమి ఢిల్లీ వేదికగా భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌తో సహా పలువురు ఇండియా కూటమి నేతలు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. ఇది మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని కేంద్ర విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.