IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్‌దే సిరీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు వరుణుడు గట్టి షాక్ ఇచ్చాడు. ఇరు జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌కు భారీ వర్షం కారణంగా అంతరాయం కలిగించింది. ఐర్లాండ్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ఇన్నింగ్స్ 8 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 54 పరుగులు మాత్రమే చేసింది. ఈ దశలో వర్షం తీవ్రం కావడంతో అంపైర్లు ఆటను నిలిపివేసి ఆటగాళ్లను డగౌట్‌కు పంపించారు.
ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ (21), అక్షర్ పటేల్ (7) పరుగులతో ఉన్నారు. అయితే, వర్షం పడే సమయానికి డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతి ప్రకారం భారత్ ఉండాల్సిన స్కోరు కంటే 15 పరుగులు వెనుకబడి ఉంది. ఒకవేళ వర్షం తగ్గకుండా ఆట ఇక్కడితోనే నిలిచిపోయి, మ్యాచ్ రద్దైతే డీఎల్ఎస్ నిబంధనల ప్రకారం ఐర్లాండ్ విజేతగా నిలుస్తుంది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఈ సిరీస్‌లో ఇప్పటికే జరిగిన మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్‌పై చారిత్రాత్మక విజయం సాధించి 1-0తో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో, ఒకవేళ వర్షం కారణంగా ఈ రెండో మ్యాచ్ పూర్తిగా రద్దైనా లేదా భారత్ డీఎల్ఎస్ పద్ధతిలో ఓడిపోయినా.. ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఐర్లాండ్ సొంతమవుతుంది. భారత జట్టు సిరీస్‌ను సమం చేయాలంటే వర్షం తగ్గి ఆట మళ్లీ ప్రారంభం కావడం, భారత్ మిగిలిన ఓవర్లలో వేగంగా పరుగులు సాధించడం అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం మైదానంలో వర్షం కురుస్తుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!