NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR – Trivikram Movie: టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి రికార్డుల సునామీ సృష్టించేందుకు ఒక మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ సెట్ అయినట్లు కనిపిస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న సరికొత్త ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ చిత్ర యూనిట్ రేపే (సోమవారం) ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు ఫిలింనగర్ సర్కిల్స్ నుంచి గట్టి టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ వార్’ (God Of War) అనే పవర్ఫుల్ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. తాజాగా నిర్మాత నాగవంశీ తన అఫీషియల్ ఎక్స్ అకౌంట్లో ఒక క్రేజీ ట్వీట్ వేసి తారక్ ఫ్యాన్స్‌లో మస్త్ జోష్ నింపారు. నేను ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రోజు రేపే అంటూ ఆయన ట్వీట్ చేశారు.
దీంతో రేపే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కాంబో రిపీట్ అవుతుండటం, దానికి తోడు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే గూస్బంప్స్ తెప్పించే టైటిల్ లీక్ అవ్వడంతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో ట్రెండింగ్స్ మొదలుపెట్టేశారు. టైటిల్‌ను బట్టే ఇది ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని, త్రివిక్రమ్ ఈ కథను మునుపెన్నడూ చూడని రీతిలో భారీ కాన్వాస్‌పై ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్తోనే టాలీవుడ్లో కొత్త రికార్డుల వేట మొదలుకానుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి రేపే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందో లేదో వేచి చూడాల్సిందే.
Also Read
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
Finally
My most awaited day is tomorrow 🦚
— Naga Vamsi (@vamsi84) June 28, 2026
- Tags
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు