Lalu Prasad: ‘అబద్ధాల రాజు’.. డబుల్ ఇంజిన్ సర్కార్‌పై లాలూ ప్రసాద్ మండిపాటు
- ‘అబద్ధాల రాజు’
- డబుల్ ఇంజిన్ సర్కార్‌పై లాలూ ప్రసాద్ మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అధికార-ప్రతిపక్ష కూటమిలు నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ చేస్తున్నాయి. విమర్శలు-ప్రతి విమర్శలతో వేడి పెంచుతున్నారు. ప్రధాని మోడీ శుక్రవారం.. విపక్ష కూటమి లక్ష్యంగా విమర్శలు గుప్పించగా… తాజాగా ప్రధాని మోడీని టార్గెట్‌గా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతి దాడికి దిగారు.

Also Read
- Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
- TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
- BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
డబుల్ ఇంజిన్ సర్కార్.. అబద్ధాల రాజుగా లాలూ ప్రసాద్ యాదవ్ అభివర్ణించారు. ‘‘నిరాకరణీయమైన అబద్ధాల రాజు’’, ‘‘నినాదాల అధిపతి’’ అయిన మోడీ.. దేశంలోని మొత్తం 13,198 రైళ్లలో 12,000 రైళ్లు ఛత్ పండుగ సందర్భంగా బీహార్‌కు వెళ్తాయని బిగ్గరగా చెప్పారని… ఇది కూడా పచ్చి అబద్ధమే అని తేలిందని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Delhi: దీపావళి నాడు ఢిల్లీలో భారీ దాడులకు ఐసిస్ ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు
20 సంవత్సరాల ఎన్డీఏ పాలనలో వలసల కష్టాలను భరించిన బీహారీలు.. ఛత్ అనే గొప్ప పండుగ సమయంలో కూడా సరైన రైలు సేవలను పొందలేకపోయారని పేర్కొన్నారు. ‘‘నా తోటి బీహార్ వాసులు అమానవీయ పరిస్థితుల్లో రైళ్లలో ప్రయాణించవలసి వస్తుంది. ఇది ఎంత సిగ్గుచేటు?.’’ అంటూ లాలూ ప్రసాద్ విరుచుకుపడ్డారు. ‘‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వ తప్పుడు విధానాల కారణంగా బీహార్ నుంచి ప్రతి సంవత్సరం 4 కోట్లకు పైగా ప్రజలు పని వెతుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. యూపీఏ కాలం నుంచి ఎన్డీఏ ప్రభుత్వం బీహార్‌లో ఎటువంటి ప్రధాన పరిశ్రమలను స్థాపించలేదు. ఈ వ్యక్తులు స్పష్టంగా బీహార్ వ్యతిరేకులు..’’ అంటూ లాలూ ప్రసాద్ ఎక్స్‌లో ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Osama bin Laden: ఆ సమయంలో లాడెన్ ఆడ వేషంలో తప్పించుకున్నాడు.. మాజీ సీఐఏ అధికారి వెల్లడి
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలు జరుగుతున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే నేటి నుంచి నాలుగు రోజుల పాటు బీహార్‌లో ఛత్ పండుగ జరగనుంది. ఈ వేడుకల కోసం రాష్ట్రం బయట ఉన్నవారంతా గ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో రైళ్లు, బస్సులు, వాహనాలు ఫుల్ రష్‌గా ఉంటున్నాయి.
शर्म करो! pic.twitter.com/uVB365Bg3v
— Lalu Prasad Yadav (@laluprasadrjd) October 25, 2025
తాజావార్తలు
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
-
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
-
Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
-
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!