మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఫిబ్రవరి, 2026 వరకు రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. మరోసారి కొనసాగించాలంటే పార్లమెంట్ లేదా ఎన్నికల సంఘం ఆమోదం అవసరం ఉంటుంది.
మణిపూర్ లో చేలరేగిని హింస నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ప్రధాని మోడీతో సమావేశం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు 40 మంది ఎమ్మెల్యేలు పీఎంఓకు ఓ లేఖ రాశారు.