KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
- ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్‌కు కేటీఆర్ వార్నింగ్
- రైతుల మరణాలపై సీఎం రేవంత్‌ను నిలదీసిన బీఆర్ఎస్ నేత
- కేబినెట్ సమావేశంలో ధాన్యం అంశం చర్చించాలని డిమాండ్
- పెండింగ్ కొనుగోళ్లు వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయని, అన్నదాతలు రోడ్డున పడుతున్నా పాలకుల్లో చలనం లేదంటూ మండిపడ్డారు.
కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పల మీదే రైతన్నలు గుండెలు ఆగి కుప్పకూలిపోతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. “రైతులు రాలిపోతున్నా చలనం లేని రాక్షస పాలన సాగుతోంది. అన్నదాతల చావులను చూసి ఆనందిస్తున్నావా ముఖ్యమంత్రి?” అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా నిలదీశారు. మండుటెండల్లో ఐయక కేంద్రాల (కొనుగోలు కేంద్రాల) కాడ రైతుల గుండెలు ఆగిపోతున్నా, ఈ కర్కశ ప్రభుత్వానికి కనీసం కనికరం కలగడం లేదా అని ప్రశ్నించారు. పంటలు కొనకుండా ఇంకెంత కాలం రైతులను యాతన పెడతారని, ఇంకెన్ని చావులు కావాలి, ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడాలో చెప్పాలని అడిగారు.
Also Read
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
ప్రభుత్వ తీరును విమర్శిస్తూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “దున్నపోతు మీద వానపడ్డట్టు ప్రవర్తించడం ఆపండి” అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రులు సోయి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఈరోజు జరగబోయే కేబినెట్ భేటీలోనైనా ధాన్యం కొనుగోలు అంశంపై చిత్తశుద్ధితో చర్చించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పంట కొనుగోళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు, తక్షణమే ధాన్యం సేకరించి అన్నదాతల తిప్పలు తప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేటీఆర్ చేసిన ఈ ఎక్స్ పోస్ట్ ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!