Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..
- భారత యువత ఉద్యమంపై ప్రశంసలు..
- పాక్, నేపాల్, శ్రీలంక యువత పొగడ్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gen Z Protest: నీట్ పేపర్ వివాదం నేపథ్యంలో భారత యువత, విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉద్యమించారు. ఎట్టకేలకు దేశ Gen Z నిరసనలకు తలొగ్గి ఆయన రాజీనామా చేశారు. అయితే, ఈ ఉద్యమంపై మన దేశ సరిహద్దు దేశాల్లోని యువత ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా దాయాది దేశం పాకిస్తాన్లోని యూత్, భారత యువతను తెగ ప్రశంసిస్తున్నారు. పాక్తో పాటు శ్రీలంక, నేపాల్కు చెందిన నెటిజన్లు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ యాక్టివిస్టులు భారత యువతను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.
జంతర్ మంతర్ ఉద్యమంలో మీమ్స్, రీల్స్, సోషల్ మీడియా ప్రచారం కీలక పాత్ర పోషించాయని, ఈ ఉద్యమాన్ని ప్రత్యేకంగా నిలబెట్టిందని కొనియాడారు. పాకిస్తాన్కు చెందిన ఓ యువతి బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘భారత్ Gen Z చేస్తున్నది చూస్తుంటే వారిని ద్వేషించడం కష్టమవుతోంది’’ అని అన్నారు. పాక్కు చెందిన కంటెంట్ క్రియేటర్ బిలాల్ హసన్ స్పందిస్తూ.. ‘‘ఈ ఉద్యమానికి పాకిస్తాన్ నుంచి నిధులు వచ్చాయని కొందరు అంటున్నారు. మా దేశాన్నే నడపడానికి డబ్బులు లేవు. మేమెలా నిధులు ఇస్తాం.?’’ అని వ్యాఖ్యానించారు. ‘‘మా దగ్గర బిర్యానీ ప్లేట్కే ప్రజలు అమ్ముడుపోతారు’’ అని అన్నారు.
Also Read
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
నేపాల్ కంటెంట్ క్రియేటర్ అవినాశ్ మిశ్రా, భారత విద్యార్థుల ఆవేదనను తక్కువ అంచనా వేయొద్దని, వారి పోరాటానికి స్పష్టమైన లక్ష్యం ఉందని అన్నారు. శ్రీలంకలో 2022 యువత ఉద్యమంలో పాల్గొన్న బువనక పెరెరా కూడా భారత యువతకు మద్దతు తెలిపారు. ‘‘ పోరాటం కొనసాగించండి’’ అంటూ మెసేజ్ ఇచ్చారు.
ఇటీవల సంవత్సరాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్లో యువత, విద్యార్థి ఉద్యమాలు జరిగాయి. బంగ్లాదేశ్లో షేక్ హసీనాను గద్దె దించారు. ఇక నేపాల్లో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించి ప్రభుత్వం మొత్తం అధికారానికి రాజీనామా చేసే వరకు వదలలేదు. ఇక శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా ఆ దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు వ్యతిరేకంగా పోరాడారు. చివరకు రాజపక్స తప్పించుకుని పారిపోయే దాకా యువత వదలలేదు.
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!