Amala Paul : నేను హీరోయిన్‌ని అనే విషయం నా భర్తకి చెప్పలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలే చేసిన కూడా ప్రేక్షకుల్లో బాగా గుర్తుండి పోతారు. అందులో మలయాళం కుట్టి అమల పాల్ ఒకరు. తెలుగులో అల్లు అర్జున్ తో ’ఇద్దరమ్మాయిలతో’, రామ్‌చరణ్ ’నాయక్‘ , నాగ చైతన్యతో ’బెజవాడ‘, నాని ’జెండాపై కపిరాజు‘ వంటి మంచి సినిమాలతో పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు, ఎందుకనో ఆ తర్వాత సరైన అవకాశాలు లేక తెలుగుకు దూరమైంది. అప్పటివరకు డీసెంట్ చిత్రాలే చేసుకుంటూ వచ్చిన అమ్మడు ఆ తర్వాత తన స్టైల్‌ను పూర్తిగా మార్చేసి, బోల్డ్ సినిమాలు చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ’ఆమె‘ అనే సినిమాలో నగ్నంగా కూడా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. అదే వరుసలో వెబ్ సీరిస్‌లు చేస్తూ లిప్‌లాక్‌లతోనూ రెచ్చి పోయింది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే..
Also Read :Single : ‘సింగిల్’ మూవీ పై అల్లు అర్జున్ ట్వీట్ వైరల్..
Also Read
2014లో తమిళ దర్శకుడు ఎల్. విజయ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న అమల పాల్ 2017లో విడాకులు తీసుకుని సింగిల్‌గానే ఉంది. తర్వాత చాలా కాలం ఒంటరిగా ఉన్న అమాలాపాల్ తన పుట్టినరోజు వేడుకలో, ఓ స్నేహితుడు ప్రఫోజ్ చేయగా ఆమె ఓకే చెబుతూ.. అతనిని ముద్దులతో ముంచేసింది. అది జరిగిన వారం రోజులలోపే వివాహం కూడా చేసుకుని ఒక్కటయ్యారు. వెంటనే గుడ్ న్యూస్ కూడా చెప్పిన ఈ అమ్మడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే తాజాగా ఒక అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న అమలా పాల్ తన భర్త కు సంబంధించిన విషయాలు మీడియాతో పంచుకుంది.
Also Read: Amina Nijam : తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న స్టార్ బ్యూటీ..
ఆమె మాట్లాడుతూ.. ‘ మేము ఇద్దరం గోవాలో కలిశాం. జగత్ గుజరాతీ అయినప్పటికీ అక్కడే ఉంటున్నారు. నేను కేవలం కేరళకు చెందిన అమ్మాయినని మాత్రమే అని అతనికి చెప్పాను. అతను ఎక్కువగా దక్షిణాది సినిమాలు చూడడు. నేను నటినని కూడా అతనికి చెప్పలేదు. కేవలం నా వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మాత్రమే అతనికి చూపించాను. నేను ప్రగ్నెంట్ గా ఉన్న సమయంలో తనకు నేను హీరోయిన్ అని తెలిసింది. దీంతో నేను గర్భంతో ఇంట్లో ఉన్నప్పుడు, అతను ఒక్కొక్కటిగా నా సినిమాలు చూడటం ప్రారంభించాడు. అతనికి అవార్డుల కార్యక్రమాలు చూడటమంటే చాలా ఇష్టం. నేను అవార్డులు తీసుకోవడం, రెడ్ కార్పెట్‌పై నడవడం, స్టేజ్‌పై మాట్లాడటం చూసి చాలా ఆశ్చర్యపోయాడు’ అంటూ చెప్పుకోచ్చింది అమలాపాల్.
- Tags
- Amala Paul
- Hasbend Jagath
తాజావార్తలు
-
Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
-
Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
-
పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..
-
Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!