Air India crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటనపై వేగంగా దర్యాప్తు సాగుతోంది. జూన్ 12న 275 మంది మరణానికి కారణమైన ఈ ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విమాన ప్రమాదానికి కారణాలు వెల్లడించే విషయంలో కీలకంగా మారిన బ్లాక్ బాక్స్ లోని డేటాను డౌన్‌లోడ్ చేశారు. జూన్ 24న అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చిన తర్వాత కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR), ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR)లోని సమాచారాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం డౌన్‌లోడ్ చేసి, విశ్లేషించడం ప్రారంభించింది. ప్రమాదానికి కారణాలు విశ్లేషించడంలో ఇది కీలకమైందని ప్రభుత్వం గురువారం తెలిపింది.
Read Also: BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!
ప్రమాదానికి దారి తీసిన సంఘటనల క్రమాన్ని రిక్రియేట్ చేయడం, విమానయాన భద్రతను మెరుగుపరచడానికి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు నివారించడానికి దోహదపడే అంశాలను గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మెమొరీ మాడ్యూల్‌ని విజయవంతంగా యాక్సెస్ చేశారు. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రయోగశాలలో సమాచారాన్ని డౌన్‌లోడ్ చేశారు. దీనికి ముందు, బుధవారం రోజున పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు AI 171 విమానం బ్లాక్ బాక్స్ ఇప్పటికీ భారతదేశంలోనే ఉందని, దీనిని AAIB పరిశీలిస్తోందని ధృవీకరించారు.