Air India crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటనపై వేగంగా దర్యాప్తు సాగుతోంది. జూన్ 12న 275 మంది మరణానికి కారణమైన ఈ ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విమాన ప్రమాదానికి కారణాలు వెల్లడించే విషయంలో కీలకంగా మారిన బ్లాక్ బాక్స్ లోని డేటాను డౌన్‌లోడ్ చేశారు.