ఇండియాలో ఎన్నికల వ్యూహకర్త అనగానే ఫస్ట్ మనకు గుర్తుకువచ్చే పేరు ప్రశాంత్ కిశోర్. 2019 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ని, 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీని, అదే ఏడాది జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోకర్ పనిచేసి గెలిపించారు. ఆ తర్వాత రాజకీయ వ్యూహకర్తగా ప్రత్యక్షంగా పనిచేయబోనని పీకే ప్రకటించారు. అప్పటి వరకు దేశంలో పీకే పేరు వినిపించింది. అయితే.. ఇప్పుడు సునీల్ కనుగోలు పేరు మారుమోగిపోతోంది. కీలకమైన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సునీల్ కనుగోలు గెలిపించారు.
Also Read : SRH vs LSG: సన్‌రైజర్స్‌పై విజయఢంకా మోగించిన లక్నో
ప్రశాంత్ కిశోర్, సునీల్ కనుగోలు 2014 ఎన్నికల్లో ఒకే టీమ్ లో పనిచేశారు. 2018లో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహకర్తగా సునీల్ కనుగోలు సొంతంగా పనిచేశారు.. కాగా ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీని గెలిపించడంలో సక్సెస్ అయ్యారు. జేడీఎస్ తో పొత్తు లేకుండానే హస్తం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సీట్లు సాధించేలా చేశారు. సునీల్ కనుగోలు ప్రస్తుతం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యూహకర్తగా వర్క్ చేస్తున్నారు. గత ఏడాది మేలో సునీల్ కనుగోలు గురించి సోనియా గాంధీ ఓ కీలక ప్రకటన చేశారు.
Also Read : DC vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
వచ్చే లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ లో సునీల్ కనుగోలును సభ్యుడిగా నియమించారు. ఆ ఎన్నికల టాస్క్ ఫోర్స్ లో కాంగ్రెస్ దిగ్గజ నేతలు పి.చిదంబరం, ముకుల్ వన్సీక్, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, ప్రియాంక గాంధీ, రణ్ దీప్ సుర్జేవాలా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆఫర్ ను ప్రశాంత్ కిశోర్ తిరస్కరించిన తరువాత సునీల్ కనుగోలు కాంగ్రెస్ తరఫున పనిచేయడానికి ఒప్పందం చేసుకున్నారు. 2016లో సునీల్ కనుగోలు తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే తరఫున వర్క్ చేశారు. డీఎంకే ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ స్టాలిన్ ప్రభావం బాగా పెరిగింది. తదుపరి ఎన్నికల్లో ఆయనను చూసే ప్రజలు ఓట్లేసి డీఎంకేకు విజయం కట్టబెట్టారు.
Also Read : Nikhil Gowda: యంగ్ హీరోకి తప్పని ఓటమి.. అమ్మ త్యాగం చేసినా..!
ఇక.. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున సునీల్ కనుగోలు పనిచేస్తున్నారు. ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే టైం ఉండటంతో ఇప్పటికే కాంగ్రెస్ ను గెలిపించేలా ఎన్నో కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఇటీవల సునీల్ టీమ్ పొంగులేటి, జూపల్లితోనూ చర్చలు జరిపింది. కాంగ్రెస్ లో చేరాలని కోరింది. సునీల్ టీమ్ తెలంగాణ సర్కార్ పై అసత్య ప్రచారం చేస్తోందని ఇటీవల కేసు కూడా పెట్టింది. కర్ణాటక ఎన్నికలు ముగియడంతో సునీల్ కనుగోలు ఇప్పటి నుంచి తెలంగాణ ఎన్నికలపైనే పూర్తి స్థాయిలో నజర్ పెట్టనున్నారు. కర్ణాటకలో అనుసరించిన ఫార్ములా సక్సెస్ కావడంతో దాన్నే ఇక్కడ ( తెలంగాణలోనూ ) అనుసరించే ఛాన్స్ ఉంది.
Also Read : BJP: బీజేపీ ఓటు షేర్ పదిలం.. జేడీఎస్‌కు గండి కొట్టిన కాంగ్రెస్
కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కాంగ్రెస్ ప్రచారంలో PayCM మొదలుకొని కాంగ్రెస్ ఇచ్చిన 5 హామీలు ప్రజల వద్దకు చేరుకునేలా సునీల్ కనుగోలు కీలక పాత్ర పోషించారు. కర్ణాటకలో కాంగ్రెస్ బలపడడం, సమష్టి నాయకత్వం ఎన్నికల ప్రచారానికి మరింత జోష్ ఇచ్చాయని హస్తం పార్టీ నేతలు అంటున్నారు.