Hate Speech Bill: సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ ఫాంల కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్వేషపూరిత ప్రసంగం (హేట్ స్పీచ్ ) చేస్తే నాన్ బెయిలబుల్ కేసులతో పాటు 3 జైలు శిక్ష, రూ. 5 వేలు ఫైన్ విధించేలా చట్టం తీసుకొస్తుంది.
బెంగళూరులో జరిగిన తొక్కిసలాట.. ఒక పీడకలగా మారింది అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ మాల్వియా పేర్కొన్నారు. ఒక వైపు, తొక్కిసలాట జరిగిన అభిమానులు తీవ్ర నిరాశలో ఉంటే.. వేదికపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ మాత్రం క్రికెటర్లతో కౌగిలింతలు, ఫోటోలు తీసుకోవడంతో చాలా బిజీగా ఉన్నారని ఆరోపించారు.
చిక్కీలో అధిక అసంతృప్త కొవ్వులు, అధిక చక్కెర కంటెంట్ ఉండటం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. వెంటనే దీన్ని నిలిపివేయాలని సిద్ధరామయ్య సర్కార్ ఆదేశించింది. మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలల్లో చిక్కీకి బదులుగా గుడ్లు లేదా అరటి పండ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
స్వాతంత్ర్యోద్యమంలో కులమతాలకు అతీతంగా అందరినీ ఒక్కటి చేసిన వినాయకుడికి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఘోర అవమానం జరిగింది. భారతీయులను బానిసల్లాగా మార్చి దాదాపు రెండు వందల ఏళ్లు పాలించిన బ్రిటీషర్స్ ని దేశం నుంచి తరమాలని పూనుకున్న బాలగంగాధర్ తిలక్..
Hijab Row: కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని కుందాపూర్‌లోని ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ బీజీకి 2024-25 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డును అందజేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. అయితే, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
Karnataka Govt: కర్ణాటక రాష్ట్రంలో భారీగా డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డెంగ్యూను అంటు వ్యాధిగా కన్నడ సర్కార్ పేర్కొంది. గతేడాది 5 వేల డెంగ్యూ కేసులు నమోదు అవగా.. ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 25 వేల కేసులు నమోదు అయ్యాయి.
Siddaramaiah : మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కాథిక్ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కష్టాలు తీరడం లేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పన్ను ఎగవేతకు పాల్పడిన అంశంలో దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు ఊరట లభించింది. కర్ణాటక ప్రభుత్వం కంపెనీకి పంపిన రూ.32,403 కోట్ల నోటీసును ఉపసంహరించుకుంది.
కర్ణాటకలోని గిరిజనాభివృద్ధి సంస్థ నుంచి ప్రైవేటు బ్యాంకు ఖాతాల్లోకి భారీ మొత్తంలో నిధులను అక్రమంగా మళ్లించారనే ఆరోపణలతో ఆ రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ మంత్రి బి నాగేంద్ర గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, యువజన సాధికారత, క్రీడల శాఖ మంత్రి బి నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బెంగళూరులో పత్రాన్ని సమర్పించారు.