దేశ వ్యాప్తంగా బీజేపీ, ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ విమర్శిస్తున్నారు. డిజిటల్ బోర్డుపై ఆధారాలు చూపిస్తూ ధ్వజమెత్తుతున్నారు.
తాజాగా కర్ణాటకలో ఒక సంచలన సర్వే వెలుగులోకి వచ్చింది. ఈవీఎంల ఓటింగ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే వెలుగులోకి వచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది. ప్రధాన ఎన్నికల అధికారి అన్బుకుమార్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది. తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వేలో ఈవీఎంలపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందంటూ 83 శాతం మంది మద్దతు తెలిపారు. 69 శాతం మంది ప్రజలు ఈవీఎంలు కచ్చితమైన సమాచారం ఇస్తాయని.. 14 శాతం మంది ఈవీఎంలను తాము సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్లు అభిప్రాయం చెప్పారు.
ఇది కూడా చదవండి: Zohran Mamdani: పాతకాలపు దుస్తుల్లో మెరిసిన న్యూయార్క్ మేయర్ దంపతులు.. ఎవరు డిజైన్ చేశారంటే..!
కర్ణాటకలోని 102 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వేను చేపట్టారు. బెంగళూరు, బెలగావి, కలబురగి, మైసూర్ సహా 102 నియోజకవర్గాల్లో ఈ సర్వే చేపట్టారు. అత్యధిక శాతం కలబురగిలో 83 శాతం మంది ఈవీఎంలను బలంగా విశ్వసిస్తున్నట్లు అభిప్రాయం చెప్పారు. మైసూర్‌లో 70 శాతం, బెళగావిలో 63 శాతం, బెంగళూరులో 63 శాతం విశ్వాసం వ్యక్తం చేశారు.
బీజేపీ ఎదురుదాడి..
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే.. రాహుల్ గాంధీకి చెంపదెబ్బ లాంటిదని ప్రతిపక్ష నేత అశోక్ వ్యాఖ్యానించారు. దేశ మంతా తిరుగుతూ రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారని.. ఇప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వం చేపట్టిన సర్వేతో నిజాలేంటో బయటపడ్డాయని పేర్కొన్నారు. ఈ సర్వే కచ్చితంగా రాహుల్ గాంధీకి చెంపదెబ్బ లాంటిదేనని బీజేపీ ధ్వజమెత్తింది. ఇంత స్పష్టంగా ప్రజలు విశ్వసిస్తుంటే.. సిద్ధరామయ్య మాత్రం బ్యాలెట్ పేపర్లతో స్థానిక ఎన్నికలు నిర్వస్తామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తే మళ్లీ కర్ణాటకను వెనక్కి తీసుకెళ్లినట్లే అవుతుందన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా.. సత్యాన్ని ఎవరూ మార్చలేరన్నారు.
ఇది కూడా చదవండి: MP: లేబర్‌తో భార్య ఎఫైర్.. ఉపాధ్యాయుడైన భర్తను ఏం చేసిందంటే..!
For years, @RahulGandhi has travelled the country telling one story:
that India’s democracy is “in danger”,
that EVMs are “untrustworthy”,
that our institutions cannot be believed.But Karnataka has just told a very different story.
A statewide survey covering thousands of… pic.twitter.com/d6I5vs0QZ7
— R. Ashoka (@RAshokaBJP) January 1, 2026