Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Star Kids: ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా పరిచయమైన జయకృష్ణ నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయిందనే చర్చ ఇండస్ట్రీలో సాగుతోంది. ఈ సినిమా రిజల్ట్‌తో స్టార్ హీరోల వారసుల ఎంట్రీపై మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సినీ వర్గాల అభిప్రాయం ప్రకారం.. స్టార్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ప్రారంభంలో గుర్తింపు, ప్రచారం తీసుకురాగలదే తప్ప, విజయాన్ని మాత్రం హామీ ఇవ్వదు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్‌తో పాటు సినిమాలో బలం ఉండాలని చెబుతున్నారు. అంతకంటే ముఖ్యంగా నటనతో ఆకట్టుకోవాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో త్వరలో హీరోలుగా పరిచయం కానున్న పలువురు స్టార్ వారసులపై కూడా కొత్త చర్చ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన తొలి సినిమా విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో అభిమానుల్లో ఆసక్తితో పాటు సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ ఎంట్రీపై కూడా తరచూ ప్రచారం జరుగుతోంది. నటనతో పాటు సంగీతం, ఇతర కళల్లో శిక్షణ పొందిన అకీరా ఎప్పుడు హీరోగా పరిచయం అవుతారనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో ఉంది. అయితే ఎంట్రీ ఎప్పుడైనా, ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలంటే తన ప్రతిభను నిరూపించుకోవాల్సిందేననే చెబుతున్నారు. ఇక మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ భవిష్యత్ సినీ ఎంట్రీ గురించీ తరచూ వార్తలు వస్తున్నాయి. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, ప్రతి వారసుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాల్సిందేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ మరోసారి ఒక విషయాన్ని స్పష్టం చేసిందనే అభిప్రాయం వినిపిస్తోంది. కుటుంబ నేపథ్యం అవకాశాలు కల్పించగలిగినా, సక్సెస్‌ని నిర్ణయించేది మాత్రం నటన, కథల ఎంపిక, ప్రేక్షకుల ఆదరణేనని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!