Mahadev Betting App: ‘‘మహాదేశ్ బెట్టింగ్ యాప్’’ దేశవ్యాప్తంగా గతేడాది సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ బెట్టింగ్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్‌ని దుబాయ్ అధికారులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్, మోసం కేసుల్లో ఇంటర్‌పోల్ జారీ చేసిన అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈడీ అభ్యర్థన మేరకు ఈ బెట్టింగ్ యాప్‌లో మరో ప్రమోటర్ గా ఉన్న రవి ఉప్పల్‌ని గతఏడాది చివర్లో దుబాయ్‌లో అదుపులోకి తీసుకుని ‘‘హౌజ్ అరెస్ట్’’ చేశారు. చంద్రశేఖర్, రవి ఉప్పల్ ఇద్దరూ కూడా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయ్‌కి చెందినవారు. వీరు దుబాయ్ నుంచి ఈ మహాదేవ్ బెట్టింగ్ దందాను నడిపారు.
చంద్రశేఖర్ ఒకప్పుడు తన సొంతూరులో జ్యూస్ అమ్ముకునే వాడు. 2019లో దుబాయ్ వెళ్లినట్లు సమాచారం. సాధారణ జ్యూస్ సెంటర్ నుంచి దాదాపుగా రూ. 6000 కోట్ల నేర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. యాప్‌ని ప్రారంభించిన తర్వాత, నిందితులు ఇద్దరు మలేషియా, థాయ్‌లాండ్, యూఏఈ, భాతరదేశంలోని ప్రధాన నగరాల్లో కాల్ సెంటర్లు తెరిచారు. దీని ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్‌ని సులభతరం చేయడానికి అనుబంధ యాప్‌లను తయారు చేసింది. ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో చంద్రశేకర్, రవి ఉప్పల్ తన సహాయకులు సునీల్ దమానీ, అనిల్ దమానీల సాయంతో ఏకంగా 30 కాల్ సెంటర్లు నిర్వహించారు.
ఈడీ ప్రకారం.. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో దాదాపుగా 4000 మంది ప్యానెల్ ఆపరేటర్లు ఉన్నారని, దాదాపు 200 మంది కస్టమర్లు బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నారని ఈడీ పేర్కొంది. ఈ పద్దని ఉపయోగించి రోజుకు కనీసం రూ. 200 కోట్లు సంపాదించారు. యూఏఈలో నేర సామ్రాజ్యాన్ని స్థాపించారు. బెట్టింగ్‌లు ఇతర ఇంటర్ లింక్డ్ యాప్‌ల ద్వారా వేల కోట్లు స్వాహా చేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.
Read Also: J-K: భారత్‌పై కుట్రకు పాకిస్థాన్ భారీ ప్లాన్..150 మందికి పైగా ఉగ్రవాదులు చొరబాటుకు యత్నం..
చంద్రకర్, ఉప్పల్ ఇద్దరూ పోలీసులు, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులతో కలిసి యాప్‌ని అమలు చేయడానికి సంబంధాలు పెట్టుకున్నారు. దమానీ సాయంతో పెద్ద సంఖ్యలో బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచారు. హవాలా ద్వారా సంపాదించిన డబ్బును పోలీసులు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లకు ఇచ్చేలా ప్లాన్ చేశారు. ఈ బాధ్యత అనిల్ దమానీ నిర్వహించాడు. ఛత్తీస్‌గఢ్ పోలీస్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ చంద్ర భూషణ్ వర్మకు కూడా డబ్బు పంపారు. ఇతను అప్పటి ఛత్తీస్‌ఘఢ్ సీఎం భూపేష్ బఘేల్ రాజకీయ సలహాదారు వినోద్ వర్మతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఇతడి మద్దతుతోనే అనిల్ దమానీ రాజకీయ నాయకులతో సిండికేట్ నిర్వహించాడు. యూఏఈలోని ప్రమోటర్లకు హవాలా ద్వారా దమానీలు పెద్ద మొత్తంలో నగదుని పంపారు. గత రెండు మూడు ఏళ్లలో రవి ఉప్పల్ అభ్యర్థన మేరకు సునీల్ దమానీ హవాలా ద్వారా రూ. 60-65 కోట్ల లావాదేవీలు నిర్వహించాడు. అయితే, తనకు మాత్రం కేవలం రూ. 6 లక్షలే ఇచ్చాడని అనిల్ దమానీ విచారణలో తెలిపాడు.
ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన సతీష్ చంద్రాకర్ నాలుగు కాల్ సెంటర్లను నడుపుతున్నాడు. 5 శాతం వాటాని కలిగి ఉన్నాడు. అక్రమ నగదు లావాదేవీలను పర్యవేక్షించే బాధ్యత ఇతడిదే. ఈ కేసులో పరారీలో ఉన్న గ్యాంగ్ స్టర్, డ్రగ్ మాఫియా బాస్ తపన్ సర్కార్‌తో కూడా సతీష్ చంద్రకర్‌కి సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది.
బాలీవుడ్‌తో కనెక్షన్స్ కూడా ఈ స్కాములో బయటపడ్డాయి. ఫిబ్రవరి 2023లో యూఏఈకి రస్ అల్ ఖైమాలో చంద్రకర్ వివాహం జరిగింది. దీని కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్లు ఈడీ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. దాదాపు 17 మంది హిందీ సిని ప్రముఖులు, చంద్రకర్ బంధువులు చార్టర్ ఫ్లైట్స్‌లో అక్కడికి వెళ్లారు. సెలబ్రెటీలు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతిఫలంగా హవాలా ద్వారా కోట్ల రూపాయలు చెల్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రణబీర్ కపూర్ మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌తో లింక్ చేయబడిన స్పోర్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకే వివాహానికి హాజరైన నటీనటులందరినీ విచారణ పరిధిలోకి చేర్చారు.