Congress: ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే గతంలో పోలిస్తే ఈ సారి మరింత ఘోరంగా కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ ఓటమి కారణంగా రాష్ట్ర పీసీసీ చీఫ్ కమల్ నాథ్‌ని మారుస్తుందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.