Solar flare: సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్‌లో చివరి దశలో ఉన్నాడు. దీంతో సూర్యుడిపై పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. 2025లో గరిష్ట సన్‌స్పాట్ యాక్టివిటీ పెరుగుతుందని అంచనా. సూర్యుడి సౌరచక్రంలో తన అయస్కాంత ధృవాలను మార్చుకుంటాడు. దీంతో ఉపరితలంపై సన్‌స్పాట్‌లు ఎక్కువగా ఏర్పడటంతో పాటు సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ పెరుగుతున్నాయి. భారీ సౌర విస్పోటనాలు జరుగుతున్నాయి.
గత 6 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా సూర్యుడిపై అతిపెద్ద సౌర జ్వాల ఎగిసి పడింది. ఇది భూమిపై ఉన్న రేడియో కమ్యూనికేషన్లకు తాత్కాలికంగా అంతరాయం కలిగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గురువారం సూర్యుడిపై భారీ రేడియో విస్పోటనం సంభవించింది. దీని నుంచి ఎగిసిపడిన మంటలు భూమి వైపుగా వస్తోంది. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ప్రకారం.. డిసెంబర్ 16, 17 తేదీల్లో భూఅయస్కాంత తుఫానులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కరోనల్ మాస్ ఎజెక్షన్‌ల (CMEలు) భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉంది.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసిన యూపీ కోర్టు..
ప్రస్తుతం సూర్యుడి నుంచి వెలువడిన సౌరజ్వాల గత ఆరేళ్లలో ఇదే పెద్దదని చెబుతున్నారు. సెప్టెంబర్ 10, 2017 నుంచి ఇదే సూర్యుడిపై అతిపెద్ద జ్వాలగా రికార్డైంది. వీటి వల్ల భూమిపై ఉన్న మనుషులకు, జీవాలు, ప్రకృతికి పెద్దగా ప్రమాదం ఉండు. భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం, సూర్యుడి నుంచి వచ్చే ఆవేశిత కణాలను అడ్డుకుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే రేడియో సిగ్నల్స్, శాటిలైట్ వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. ఈ జియో మ్యాగ్నటిక్ స్ట్రోమ్స్ వల్ల ధృవాల వద్ద ఆరోరాలని పలువబడే ప్రకాశవంతమైన కాంతి ఏర్పడుతుంది.