దేశీయ స్టాక్ మార్కె్ట్‌కు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు ముందు సరికొత్త జోష్ వచ్చింది. గత ఐదు నెలల్లో ఎన్నడూ చూడని విధంగా సూచీలు రాకెట్‌లా దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు బాగా కలిసొచ్చాయి.
జార్ఖండ్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో దశ ఎన్నికల పోలింగ్ కోసం జోరుగా ప్రచారం సాగుతోంది. ఫస్ట్ ఫేజ్‌లో 66 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. రెండో దశ ఓటింగ్ నవంబర్ 20న జరగనుంది.
జార్ఖండ్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. నవంబర్ 13న ఫేజ్-1 ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. బుధవారం 43 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. ఉదయం నుంచి ఓటర్లు ఉత్సాహం పోలింగ్ బూత్‌లకు తరలివచ్చి ఓట్లు వేశారు.
జార్ఖండ్‌లో బుధవారం తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బంది.. ఈవీఎంలు తీసుకుని పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో నగదు ప్రవాహంలాగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో విచ్చలవిడిగా డబ్బు కట్టలు తరలిస్తున్నారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ-ఎం కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించింది. రాంచీలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం హేమంత్ సోరెన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.