జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్ సెషన్-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను సోమవారం ఉదయం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫలితాలను విద్యార్థులు jeemain.nta.nic.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలను దేశవ్యాప్తంగా 500 కేంద్రాల్లో జూన్ 23 నుంచి 29 వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. ఈ పరీక్షలకు సంబంధించిన కీని ఈనెల 6న అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతానికి జేఈఈ మెయిన్ పేపర్-1 (బీఈ, బీటెక్) సంబంధించిన ఫలితాలను మాత్రమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. పేపర్-2 (బీఆర్క్, బీ ప్లానింగ్) ఫలితాలను ఇంకా విడుదల చేయాల్సి ఉంది.
Read Also: COVID19: ఇండియాలో కొత్తగా 16,678 కరోనా కేసులు.. పెరుగుతున్న పాజిటివిటీ రేటు
కాగా జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు జూలై 21 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఈఏడాది తెలంగాణ నుంచి 50 వేలకు మందికి పైగా విద్యార్థులు తొలివిడత జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. తెలంగాణకు చెందిన యశ్వంత్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పి. ఆదినారాయణ, కె.సుహాస్, కె.ధీరజ్, అనికేత్ చటోపాధ్యాయ, రూపేష్ వంద పర్సంటైల్ సాధించారు.