Jan Dhan Accounts: దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న జన్‌ధన్ అకౌంట్ల సంఖ్య 50 కోట్లు దాటింది. ఆయా అకౌంట్లలో ప్రస్తుతం రూ. 2.03 లక్షల కోట్లకు పైగా డిపాజిట్‌లు ఉన్నాయి. జన్‌ధన్ ఖాతాలు ఎక్కువ శాతం మహిళల పేరుతో ఉన్నాయి. 9 ఏళ్లలోపు ధన్ ఖాతాలు 50 కోట్ల మార్క్‌ను దాటాయని కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఖాతాల్లోని మొత్తం డిపాజిట్లు రూ. 2.03 లక్షల కోట్లకు పైగా ఉండగా.. వాటిలో దాదాపు 34 కోట్ల రూపే కార్డులు ఉచితంగా జారీ చేయబడ్డాయని కేంద్రం ప్రకటించింది.
Read also: Pooja Hegde : టెంప్టింగ్ లుక్స్ తో బీచ్ లో రెచ్చిపోయిన పూజా హెగ్డే..
జన్‌ధన్ ఖాతాల్లో సుమారు 67% ఖాతాలు గ్రామీణ ప్రాంతాలతోపాటు.. సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఓపెన్ చేసినట్టు ఆర్థిక శాఖ ప్రకటించింది. దేశంలో మొత్తం జన్ ధన్ ఖాతాల్లో 56 శాతం మహిళల ఖాతాలు ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాల్లో సగటు బ్యాలెన్స్ రూ. 4,076 గా ఉంది. జన్‌దన్ ఖాతాల్లో 5.5 కోట్లకు పైగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) సబ్సిడీ పొందుతున్నట్లు తెలిపింది. ఇది దేశ ఆర్థిక రంగాన్ని మార్చడంలో విజయవంతమైంది.PMJDY ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా బ్యాంక్ ఖాతాను ప్రారంభించడానికి అవకాశం కల్పించారు. రూ. 2 లక్షల ప్రమాద బీమా అవకాశం కల్పించారు. ఉచితంగా రూపే డెబిట్ కార్డ్‌లను అందజేశారు. జన్‌ధన్ ఖాతాల్లో రూ. 10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పించారు.