Prashant Kishor: ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ల విత్‌డ్రా.. బీజేపీ ఒత్తిడితోనే జరిగిందన్న ప్రశాంత్ కిషోర్
- ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ల విత్‌డ్రా
- బీజేపీ ఒత్తిడితోనే జరిగిందన్న ప్రశాంత్ కిషోర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే జన్ సురాజ్ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో బీజేపీపై జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ధ్వజమెత్తారు. బీజేపీ ఒత్తిడి కారణంగానే తమ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి వైదొలిగారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన అభ్యర్థులను బెదిరించి నామినేషన్ల ఉపసంహరించుకునేలా చేశారని తెలిపారు. బీజేపీకి పోరాడటానికి ధైర్యం లేకపోవడంతో ఇలాంటి ఒత్తిడి వ్యూహాలకు పాల్పడుతుందని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Modi-Trump: ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడదాం.. ట్రంప్ దీపావళి శుభాకాంక్షలపై మోడీ రిప్లై
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
జన్ సురాజ్ పార్టీకి చెందిన దానాపూర్, బ్రహంపూర్, గోపాల్‌గంజ్ స్థానాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. గోపాల్‌గంజ్ అభ్యర్థి శశి శేఖర్ సిన్హా అకస్మాత్తుగా మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. జన్ సురాజ్‌కు చెందిన ఇతర అభ్యర్థులు కూడా ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని… బీహార్‌లో ఓటమి భయంతో బీజేపీ ఎలా కుయుక్తులకు పాల్పడుతుందని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Sanjay Roy: ఆర్జీ కర్ హత్యాచార దోషి ఇంట్లో చిన్నారి మృతదేహం కలకలం.. పోలీసుల దర్యాప్తు
బీహార్‌లో ఎన్డీఏ కూటమి మినహా మిగతా అన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. నిన్నామొన్నిటి దాకా కలిసి తిరిగిన ఇండియా కూటమి పార్టీలు.. చివరి నిమిషంలో ఎవరిదారి వారే చూసుకున్నారు. విభేదాలు కారణంగా వేర్వేరుగా పోటీ చేస్తున్నారు. విపక్ష కూటమి బలహీనతను ఎన్డీఏ కూటమి క్యాష్ చేసుకుంటోంది.
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇక ప్రధాని మోడీ అక్టోబర్ 24న ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు.
ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు ఉన్నారు. అలాగే రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు నాయకులు ఈ జాబితాలో ఉన్నారు. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్లను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించారు.
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!