India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్‌తో తలపడే ప్రతి టీ-20 సిరీస్‌లోనూ కొత్త కెప్టెనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, ఐర్లాండ్ మధ్య జరగబోయే రెండు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌కు టీమిండియా సర్వసిద్ధమైంది. ఈ సిరీస్ ద్వారా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మొదటిసారి భారత టీ-20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నారు. ఇరు జట్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్ జూన్ 26న, రెండో మ్యాచ్ జూన్ 28న సాయంత్రం వేళల్లో జరగనున్నాయి. భారత్, ఐర్లాండ్ దేశాల మధ్య జరగబోయే నాలుగో ద్వైపాక్షిక టీ-20 సిరీస్ ఇది. విశేషం ఏంటంటే.. ఐర్లాండ్‌తో జరిగిన ప్రతి టీ-20 సిరీస్‌లోనూ భారత్ తరపున వేర్వేరు ఆటగాళ్లు కెప్టెన్లుగా వ్యవహరించగా, ఇప్పుడు నాలుగో సిరీస్‌లోనూ సరికొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టారు.
భారత్, ఐర్లాండ్ జట్లు టీ-20 అంతర్జాతీయ క్రికెట్లో మొదటిసారి 2009 టీ-20 ప్రపంచకప్‌లో తలపడ్డాయి. అప్పుడు భారత జట్టుకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా ఉన్నారు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం 2018లో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్, ఐర్లాండ్ మధ్య తొలిసారి టీ-20 సిరీస్ జరిగింది. ఆపై 2022 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా, 2023 సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా టీమిండియాను నడిపించారు. ఇక 2009 తర్వాత ఈ రెండు జట్లు ప్రపంచకప్ వేదికగా మళ్లీ 2024లో తలపడ్డాయి, అప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ కాలంలో ఐర్లాండ్‌తో భారత్ ఎలాంటి మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు 2024 తర్వాత మళ్లీ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ విధంగా చూస్తే కేవలం ఐర్లాండ్‌పైనే భారత్ తరపున ఆరుగురు వేర్వేరు కెప్టెన్లు వ్యవహరించడం గమనార్హం.
Also Read
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
- Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
భారత టీ-20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు మొత్తం 15 మంది కెప్టెన్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే వీరిలో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మాత్రమే పూర్తిస్థాయి క్రమం తప్పకుండా కెప్టెన్లుగా కొనసాగారు. మిగిలిన కెప్టెన్ల సంఖ్య పెరగడానికి ఇలాంటి చిన్న చిన్న ద్వైపాక్షిక సిరీస్‌లే కారణం. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 15 మంది కెప్టెన్లలో ఆరుగురు ఐర్లాండ్‌పై కెప్టెన్లుగా జట్టును నడిపించారు. ఆ వివరాలు.. ఎంఎస్ ధోని (2009 ప్రపంచకప్), విరాట్ కోహ్లీ (2018 సిరీస్), హార్దిక్ పాండ్యా (2022 సిరీస్), జస్ప్రీత్ బుమ్రా (2023 సిరీస్), రోహిత్ శర్మ (2024 ప్రపంచకప్) మరియు శ్రేయస్ అయ్యర్ (2026 ప్రస్తుత సిరీస్).
తాజావార్తలు
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!