T20 World Cup: మహిళా ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన 23వ మ్యాచ్‌లో భారత బౌలర్ శ్రీ చరణి ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆమె సరికొత్త రికార్డు నెలకొల్పింది. మాంచెస్టర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీ చరణి రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా పూనం యాదవ్ పేరిట ఉన్న 6 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టింది.
పూనం యాదవ్ 2020 ప్రపంచ కప్‌లో 10 వికెట్లు తీయగా, శ్రీ చరణి ఈ టోర్నీలో తన వికెట్ల సంఖ్యను 12కు పెంచుకుంది. మ్యాచ్ 20వ ఓవర్లో షోర్నా అక్తర్‌ను అవుట్ చేయడం ద్వారా పూనం రికార్డును సమం చేసిన చరణి, ఆ తర్వాత నహీదా అక్తర్‌ను అవుట్ చేసి 12వ వికెట్‌తో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో డయానా డేవిడ్ (2010లో 9 వికెట్లు) మూడో స్థానంలో ఉంది. కాగా.. ఒకే ప్రపంచ కప్‌లో అత్యధికంగా 15 వికెట్లు తీసిన ప్రపంచ రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన అమేలియా కెర్ పేరిట ఉంది.
Also Read
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో జుయైరియా ఫిరదౌస్ 33 పరుగులు, కెప్టెన్ నిగార్ సుల్తానా 32 పరుగులు చేశారు. ప్రారంభంలో భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేసి పేలవ ప్రదర్శన చేసినప్పటికీ, ఆ తర్వాత బౌలర్లు పుంజుకున్నారు. ముఖ్యంగా నందిని వరుసగా రెండు క్యాచ్‌లు వదిలేసినా, ఆ తర్వాత జుయైరియా వికెట్ తీసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టగా, శ్రీ చరణి 2 వికెట్లు సాధించింది. బౌలర్ల సమిష్టి కృషితో బంగ్లాదేశ్‌ను 150 పరుగుల లోపే కట్టడి చేయగలిగారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!