Ravindra Jadeja: లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టు చివరి రోజు ఉదయం ఆటలో ఉత్కంఠతో పాటు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సెషన్ ఆఖరి దశలో భారత బ్యాటర్లు వరుసగా ఔట్ కావడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్ల టెంపరమెంట్ పెరిగిపోయింది. ఆ సమయంలో భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే మిగిలిన తరుణంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజాపై మాటల దాడికి దిగారు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, బ్రైడన్ కార్స్ వాడి వేడి పదజాలంతో వారిని టార్గెట్ చేశారు.
Read Also:Mystery : 70,000 ఏళ్ల రహస్యం.. తమిళనాట దొరికిన తొలి మానవుడి DNA.!
ఇదేసమయంలో 35వ ఓవర్ చివరి బంతిని ఆడిన అనంతరం జడేజా పరుగుకి వెళ్లగా, బ్రైడన్ కార్స్ అతనికి అడ్డుపడ్డాడు. ఇది అనుకోకుండా జరిగిన ఢీగా కనిపించినా.. మైదానంలో ఉన్నవారితో పాటు మ్యాచ్ చూస్తున్న వారందరూ.. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందని భావించారు. కార్స్ తన చేతిని జడేజా మెడకి చుట్టేయడంతో పరుగులు తీయడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ సంఘటనతో కోపోద్రికుడైన జడేజా వెంటనే అతనిపై తీవ్రంగా ప్రతిస్పందించాడు. కార్స్ కూడా అదే తీరుగా స్పందించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ ఉద్రిక్తతను ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మధ్యలోకి వచ్చి నియంత్రించాల్సి వచ్చింది. మధ్యలో నిలిపిన మ్యాచ్‌కి దాదాపు ఒక నిమిషంపాటు ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Read Also:Make In India : వింబుల్డన్ స్టార్లకు ఇష్టమైనవి ‘మేక్ ఇన్ ఇండియా’ టవళ్లే..! విదేశాల్లో భారత్ హవా..!
ఇక ఈ వార్త రాసే సమయానికి భారత్ గెలుపు కోసం 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. అంటే, టీమిండియా గెలుపుకు మరో 60 పరుగులు అవసరం. ఇంగ్లాండ్ గెలవాలంటే 2 వికెట్లను నేలకూల్చాలి.
Drama, more drama! 👀#ENGvIND 👉 3rd TEST, DAY 5 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/DTsJzJLwUc pic.twitter.com/eiakcyShHV
— Star Sports (@StarSportsIndia) July 14, 2025