Modi Wang Yi meeting: భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారత్, చైనా మధ్య సంబంధాలు స్థిరమైన పురోగతిని సాధించాయని తెలిపారు. ఈసందర్భంగా ప్రధాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “వాంగ్ యీని కలవడం ఆనందంగా ఉంది. గతేడాది కజాన్లో జిన్పింగ్‌తో సమావేశమైనప్పటి నుంచి.. ఇరుదేశాల సంబంధాలు స్థిరమైన పురోగతిని సాధించాయి. సున్నిత అంశాలను గౌరవించడం,…
S Jaishankar: చైనాతో భారత సంబంధాలు నార్మల్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. జూలై 14, 15 తేదీల్లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి ఆయన డ్రాగన్ కంట్రీకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే చైనా కీలక నేతలతో ఆయన భేటీ అవుతున్నారు. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మద్య సంబంధాలు క్షీణించాయి. 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా రెండు…
S Jaishankar: భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో మొదటిసారిగా ఈ వీకెండ్‌లో చైనాను సందర్శిస్తారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. 2020లో గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత, ఇరు దేశాలు తమ సంబంధాలను సాధారణం చేసుకునేందుకు కృషి చేస్తున్నాయి. ఈ పర్యటనలో జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.