Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajay Bhupathi: శ్రీనివాస మంగాపురం సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, స్టార్ హీరో మహేష్ బాబు అన్న కొడుకు జయ కృష్ణ హీరోగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘వెంకటప్పయ్య నాయుడు’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా చిత్రం జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ.. చేసిన క్రేజీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ.. తన సినిమాలపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు, తాను కథ చెప్పే విధానం, తన సిగ్నేచర్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన ప్రతి సినిమాలో కొత్తదనం ఉండాలని, ఒకే తరహా జానర్లో సినిమాలు చేయడం తనకు ఇష్టం ఉండదని వెల్లడించారు. తన సినిమాల్లో క్లైమాక్స్‌లో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడిందని, అయితే ప్రతి సినిమాకు ముందుగానే ట్విస్ట్‌ను దృష్టిలో పెట్టుకుని కథ రాయడం సరైన విధానం కాదని అన్నారు. కథ సహజంగా సాగినప్పుడే ప్రేక్షకులకు నిజమైన అనుభూతి కలుగుతుందని చెప్పారు. “ఒకే రుచితో హోటల్ నడపలేం.. కొంతకాలం తర్వాత ప్రేక్షకులు కొత్త రుచులను కోరుకుంటారు. అలాగే సినిమాల్లో కూడా ఒకే జానర్లో కొనసాగితే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది” అని ఆయన వివరించారు.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
దర్శకులు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, సిగ్నేచర్ స్టైల్‌ను ఏర్పరుచుకోవాలని అజయ్ భూపతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన గురువు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రస్తావిస్తూ, ఆయన కెరీర్లో ‘శివ’, ‘క్షణ క్షణం’, ‘రంగీలా’, ‘సత్య’, ‘సర్కార్’, ‘రక్త చరిత్ర’ వంటి విభిన్న జానర్ల సినిమాలు చేసినప్పటికీ, ప్రతి సినిమాలో ఆయన మేకింగ్ స్టైల్ కనిపిస్తుందని అన్నారు. ఒక దర్శకుడి పేరు తెలియకుండానే సినిమా చూస్తే అది ఎవరి స్టైలో చెప్పగలిగే స్థాయికి చేరుకోవడమే గొప్పదని అజయ్ భూపతి అభిప్రాయపడ్డారు. రామ్ గోపాల్ వర్మతో పాటు పెద్ద వంశీ, విశ్వనాథ్, బాపు, మణిరత్నం వంటి దర్శకులకు కూడా ప్రత్యేకమైన సిగ్నేచర్ ఉందని తెలిపారు. తన సినిమాల విషయంలో కూడా అలాంటి ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తున్నానని అజయ్ భూపతి చెప్పారు. భవిష్యత్తులో తాను కామెడీ సినిమా చేసినా, మరో జానర్ ఎంచుకున్నా తన శైలి మాత్రం ప్రేక్షకులకు కనిపించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా తన గత చిత్రాలకు భిన్నంగా ఉన్నప్పటికీ, తన మేకింగ్ స్టైల్ మాత్రం కనిపిస్తుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!