2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2027 వన్డే ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీకి ఇంకా సమయం ఉన్నప్పటికీ, భారత జట్టు ఎంపికపై క్రీడా వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ 2027 ప్రపంచకప్ కోసం తనకిష్టమైన 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. అయితే ఆయన ఎంపిక చేసిన జట్టులో సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ మహమ్మద్ షమీలకు స్థానం లభించకపోవడం గమనార్హం. అంతేకాకుండా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి వంటి ఆటగాళ్లను కూడా ఆయన పక్కనబెట్టారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ప్రధాన జట్టులో కాకుండా కేవలం బ్యాకప్ ఓపెనర్‌గా మాత్రమే ముకుంద్ భావించారు.
ముకుంద్ ఎంచుకున్న జట్టులో టాప్ ఆర్డర్ బాధ్యతలను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌లకు అప్పగించారు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్‌కు చోటు కల్పించగా, వికెట్ కీపింగ్ ఆప్షన్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేశారు. ఆల్ రౌండర్ల విభాగానికి వచ్చేసరికి హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు అవకాశం ఇచ్చారు. ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
Also Read
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణాతో పాటు ఇటీవలే అరంగేట్రం చేసిన గుర్నూర్ బ్రార్‌కు అనూహ్యంగా చోటు కల్పించారు. మొత్తం ఐదుగురు పేసర్లతో పేస్ దళాన్ని బలంగా తీర్చిదిద్దారు. రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్‌లను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నప్పటికీ, పరిస్థితిని బట్టి ఆలోచించవచ్చని అభిప్రాయపడ్డారు.
అభినవ్ ముకుంద్ ఎంచుకున్న 15 మంది సభ్యుల భారత జట్టు..
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!