AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్‌పై ఆప్ ఎదురుదాడి
- ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా..
- సీజేపీ ఉద్యమాన్ని బలహీనపరుస్తున్నారంటూ ఆప్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: ఢిల్లీలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సోమవారం, కాక్రోచ్ జనతా పార్టీ(సీజీపీ) మద్దతుదారులు పార్లమెంట్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. ఈ నిరసన హింసాత్మకంగా మారింది. నిరసనకారులు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణల్లో వందకు పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆందోళనకారులతో పాటు పోలీసులు ఉన్నారు.
మంగళవారం ఈ నిరసనలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్రమోడీ నివాసం ముందు ధర్నా చేశారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే, కర్ణాటక, కేరళ సీఎంలు డీకే శివకుమార్, సతీషన్లు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. విద్యార్థులపై దాడికి నిరసనగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు.
Also Read
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ ధర్నాపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్ కాంగ్రెస్ నేతల్ని ప్రశ్నించారు. సీజేపీ నిరసనను కాంగ్రెస్ బలహీనపరుస్తోందని ఆయన ఆరోపించారు. సీజేపీ నిరసనను బలహీనపరిచేందుకు, మోడీజీ రాహుల్ గాంధీని తన నివాసంలో నిరసనకు కూర్చోబెట్టారు అని ఆయన ఎక్స్‌లో రాశారు. ఇదే విషయంపై ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ నేత అతిషా సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది అద్భుతం! సీజేపీ, సోనమ్ వాంగ్‌చుక్ నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. మోదీ ప్రభుత్వం వారితో చర్చలకు నిరాకరిస్తోంది. అదే సమయంలో, రాహుల్ గాంధీని ప్రధాని నివాసం బయట నిరసన తెలిపేందుకు అనుమతించారు. గంటలోపే మోదీ ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. వావ్!’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.
తాజావార్తలు
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!