CP Radhakrishnan: ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్టప్రతి భవన్‌లో ఉదయం 10 గంటలకు జరగనున్న కార్యక్రమంలో రాధాకృష్ణన్ తదుపరి ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వారు తెలిపారు.
కళంకితులెవరైనా రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కళంకిత నేతలు జైలు నుంచి పరిపాలించడమేంటి? అని ప్రశ్నించారు.
Jagdeep Dhankhar: దేశంలోనే రెండో అత్యున్నత పదవికి పదవీకాలం ఉండగానే రాజీనామా చేసి సంచలనం సృష్టించిన వ్యక్తి మాజీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖఢ్. ఆయన గత నెలలో అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేసి యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచారు. నాటి నుంచి ఆయన ఇప్పటి వరకు ఎక్కడ బహిరంగంగా కనిపించలేదు, కనీసం చిన్న ప్రకటన కూడా చేయలేదు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారని చాలా మంది ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా దీనిపై…
BJP Parliamentary Board Meeting: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నాహాలను ముమ్మరం చేసింది. సెప్టెంబర్ 9న జరగనున్న ఎన్నికలకు పార్టీ తరుఫున పోటీ చేయనున్న అభ్యర్థి పేరును నిర్ణయించే ప్రక్రియను ప్రారంభించింది. ఆదివారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలక సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. కాషాయ దళం నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా, బీహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ నారాయణ్ సింగ్ పేర్లు…
జగదీప్ ధన్‌ఖర్.. జూలై 21 సాయంత్రం వరకు భారతదేశ ఉపరాష్ట్రపతి. ఆరోజే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక రాజ్యసభలో ధన్‌ఖర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.
జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవి కోసం త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఈ అంశంపై తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగదీప్ ధన్కడ్ రాజీనామా బాధాకరమన్నారు.
Vice presidential poll: సోమవారం జగదీప్ ధంఖర్ ఆకస్మిక రాజీనామాతో భారత ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది. వైద్య కారణాలను చూపుతూ ధంఖర్ సోమవారం సాయంత్రం ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకు పంపారు, తక్షణమే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. దీంతో మరోసారి ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఉపాధ్యక్ష పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడం కొత్త రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ధన్కర్ రాజీనామాపై ఊహాగానాలు మొదలయ్యాయి. తీవ్ర రాజకీయ వాగ్వాదం కూడా జరుగుతోంది.
Jagdeep Dhankhar Resign: భారత ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారు అనే అంశం దేశవ్యాప్తంగా రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే, గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వానికి జగదీప్ ధన్ఖడ్ మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ధన్‌ఖర్ సభా కార్యకలాపాలు బాగానే నిర్వహించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కనిపించలేదు.