ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎన్‌సీపీ నేత శరద్‌పవార్ ఆద్వర్యంలో దేశంలోని వివిధ పార్టీల నేతలతో సమావేశం కాబోతున్నారు. మూడో ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఈ పార్టీలతో సమావేశం కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తం 15 పార్టీలు ఈ సమావేశానికి హాజరుకాబోతున్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధానమైన మూడు పార్టీలైన టీడీపి, వైఎస్ఆర్‌సీపీ, టీఆర్ఎస్ పార్టీలు హాజరుకావడం లేదని సమాచారం. మోడినీ, బీజేపీని ప్రధానంగా ఎదుర్కొనడానికి బలమైన ఫ్రంట్ అవసరం కావడంతో విపక్షాలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహానపడింది. అదే సమయంలో బీజేపీ బలంగా పుంజుకుంది. దాదాపుగా చాలా రాష్ట్రాల్లో సొంతంగా, కొన్ని పార్టీలతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్నది.
Read: ఓటీటీ చర్చల్లో నితిన్ ‘మాస్ట్రో’!
ఏలాగైనా రాబోయో రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నది. దేశంలో ప్రస్తుతం నెలకొన్నపరిస్థుల దృష్ట్యా బీజేపీకి కొంత ఎదురుగాలి వీస్తున్నా, మోడి చరిష్మా తగ్గలేదన్నది వాస్తవం. వచ్చే ఎన్నికల నాటికి తిరిగి బీజేపీ పుంజుకొని మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే, ఆ తరువాత రోజుల్లో మిగతా పార్టీల మనుగడ కష్టం అవుతుంది. 2024 లో బీజేపీని ఎదుర్కొనడం కోసం విపక్షాలు ఇప్పటి నుంచే కార్యాచరణను మొదలుపెట్టాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విపక్ష పార్టీల మధ్య మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్నారు. మరి ఈ వ్యూహం ఫలిస్తుందా? థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని గతంలో టీఆర్ఎస్ నేత కేసీఆర్ ప్రయత్నించి విఫలం అయ్యారు. దాదాపుగా 16 ఏళ్ల తరువాత థర్డ్ ఫ్రంట్ విషయం మరోమారు తెరమీదకు వచ్చింది. ఈ చర్చలు ఎంత వరకు సఫలం అవుతాయో చూడాలి.