దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో మోడీని, ఎన్‌డీఏను ఎదుర్కొనడానికి మూడో ఫ్రంట్ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా శరద్‌పవార్ ఇటీవలే దేశంలోని వివిధ పార్టీలతో మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌కు కాంగ్రెస్‌తో పాటుగా కొన్ని కీలక పార్టీలు హాజరుకాలేదు. మూడో ఫ్రంట్ ప్రయత్నాలు ఎప్పటినుంచో చేస్తున్నా, సరైన ఫలితాలు ఇవ్వడంలేదన్నది వాస్తవం. అయితే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మద్యవర్తిత్వంతో పలు పార్టీలు ఇటీవలే ముంబైలోని శరద్‌పవార్ నివాసంలో భేటీ అయ్యాయి.…
ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎన్‌సీపీ నేత శరద్‌పవార్ ఆద్వర్యంలో దేశంలోని వివిధ పార్టీల నేతలతో సమావేశం కాబోతున్నారు. మూడో ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఈ పార్టీలతో సమావేశం కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తం 15 పార్టీలు ఈ సమావేశానికి హాజరుకాబోతున్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధానమైన మూడు పార్టీలైన టీడీపి, వైఎస్ఆర్‌సీపీ, టీఆర్ఎస్ పార్టీలు హాజరుకావడం లేదని సమాచారం. మోడినీ, బీజేపీని ప్రధానంగా ఎదుర్కొనడానికి బలమైన ఫ్రంట్ అవసరం కావడంతో విపక్షాలు ఈ సమావేశాన్ని…