India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కి భారత్ షాక్‌లు ఇస్తూనే ఉంది. ఇప్పటికే దౌత్యపరంగా దెబ్బతీసింది. కీలకమైన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా అకౌంట్లపై అణిచివేత చర్యలు చేపట్టింది.