Sharad Pawar: ఎన్సీపీ సంక్షోభం.. శరద్ పవార్ వర్గం సూచించిన కొత్త పేర్లు, ఎన్నిక చిహ్నాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar:నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సంక్షోభం నేపథ్యంలో మంగళవారం ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని ప్రకటించి శరద్ పవార్‌కి షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ వర్గంలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం శరద్ పవార్ వర్గం కొత్త పేర్లు, ఎన్నికల గుర్తులను సూచించాలని కోరింది.
Read Also: BJP vs Congress: ఢిల్లీ వేదికగా హీటెక్కిన కర్ణాటక రాజకీయం
Also Read
ఈ నేపథ్యంలో శరద్ పవార్ వర్గం మూడు పేర్లు, ఎన్నికల గుర్తులను సూచించినట్లు తెలుస్తోంది. ‘శరద్ పవార్ కాంగ్రెస్’, ‘మి రాష్ట్రవాది’, ‘శరద్ స్వాభిమాని’ అనే మూడు పేర్లతో పాటు ‘టీ కప్పు’, ‘సన్ ఫ్లవర్‘, ‘ఉదయించే సూర్యుడు’ గుర్తులను ఈసీకి ప్రతిపాదించినట్లు సమాచారం. నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని ఈసీ ప్రకటించి, ఎన్నికల చిహ్నం ‘గడియారం’ని అజిత్ పవార్ వర్గానికే కేటాయించింది.
ఈసీ నిర్ణయంపై అజిత్ పవార్ వర్గం సంబరాలు చేసుకుంటే.. శరద్ పవార్ వర్గం ఈ నిర్ణయాన్ని ‘‘ ప్రజాస్వామ్య హత్య’’ అభివర్ణించింది. గతేడాది అజిత్ పవార్ ఎన్సీపీలో చీలక తీసుకువచ్చారు. ఆ తర్వాత శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని అజిత్ పవార్ తీసుకున్నారు. పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి.
- Tags
- Ajit Pawar
- EC
- Maharashtra
- NCP
- ncp crisis
తాజావార్తలు
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
-
Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!