Meta:కెనడాలో ఐఐటీ గ్రాడ్యుయేట్ తిప్పలు.. రెండురోజుల్లోనే జాబ్ తీసేసిన మెటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Man Relocates To Canada For Meta Job, Laid-Off Just 2 Days Later: ఉద్యోగం కోసం కోటి ఆశలతో ఇండియా నుంచి కెనడాకు వెళ్లిన ఓ ఐటీ ఉద్యగికి ఊహించని షాక్ తగిలింది. కెనడాకు వెళ్లిన రెండు రోజుల్లోనే ఉద్యోగం నుంచి తీసేసింది ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా. ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్ పూర్ యూనివర్సిటీ చదివిన విద్యార్థినే తీసి పక్కన పడేసింది. భారత దేశం నుంచి వెళ్లిన రెండు రోజులకే తనను ఉద్యోగం నుంచి తీసేయడంపై వీ హిమాన్షు అనే ఉద్యోగి భావోద్వేగానికి గురయ్యాడు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన హిమాన్షు గతంలో అడోబ్, ఫ్లిప్ కార్ట్ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేశాడు.
Read Also: IT Industry: ఐటీలో కోటి కష్టాలు.. రానున్నది గడ్డుకాలమేనా..?
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
తన పరిస్థితిని వివరిస్తూ లింక్డ్ఇన్ పోస్ట్‌లో ఇలా రాశాడు..‘‘ నేను మెటాలో చేరడానికి కెనడాకు మకాం మార్చాను. అక్కడ విధుల్లో చేరిన రెండు రోజుల్లోనే భారీ తొలగింపుల కారణంగా ఉద్యోగం పోయింది. ప్రస్తుతం క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్న నాలాంటి వాళ్లను చూస్తే బాధగా ఉందని, తన తదుపరి ప్రయాణం గురించి తనకు తెలియదని.. ఏదైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఉంటే తెలియజేయాలి’’ అని కోరాడు. ఇండియాలో లేదా కెనడాలో ఏదైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఉంటే తెలియజేయాలని పోస్ట్ లో కోరాడు.

హిమాన్షు పరిస్థితిపై పలువురు సానుభూతి వ్యక్తం చేశారు. చాలా మంది అతడిని ఓదార్చారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకునే కంపెనీల లింక్‌లను పంచుకున్నారు. రెండు రోజుల తర్వాత తొలగించేందుకు ఉద్యోగులు ఖండాంతరాలు దాటేలా కంపెనీలు చేస్తున్నాయని మరొకరు కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే ఆదాయాలు తగ్గడంతో పాటు ఆర్థికమాంద్యం భయాల కారణంగా మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు. 13 శాతం మందిని తగ్గించుకుంటున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులకు 16 వారాల బేస్ సాలరీతో పాటు ప్రతీ ఏడాది సర్వీసుకు మరో రెండు వారాలు అదనంగా ఉద్యోగులకు చెల్లిస్తామని మెటా వెల్లడిాంచింది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!